Fact Check: ప్రమోషనల్ వీడియోను మెట్రోలో చంద్రముఖి ప్రత్యక్షమైందని షేర్ చేస్తున్నారు

Here Is The Fact Behind Viral Video Of Manjulika Travelling In Metro. “మెట్రో రైలెక్కి తిర్గింది చంద్రముఖి" అంటూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒక యువతి చంద్రముఖి

By Nellutla Kavitha
Published on : 26 Jan 2023 2:36 PM IST

Fact Check: ప్రమోషనల్ వీడియోను మెట్రోలో చంద్రముఖి ప్రత్యక్షమైందని షేర్ చేస్తున్నారు

“మెట్రో రైలెక్కి తిర్గింది చంద్రముఖి" అంటూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒక యువతి చంద్రముఖి వస్త్రధారణతో మెట్రో రైల్ లో ప్రత్యక్షమైంది అని ఒక వార్తా ఛానల్ ప్రసారం చేసింది. వైరల్‌ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడానికి, లైకుల కోసం, చంద్రముఖి అవతారంలో మెట్రో ట్రైన్ లో వీడియో చేశారని, మెట్రో అధికారుల కళ్ళలో పడితే శిక్ష తప్పదని మరో ఛానల్ ప్రసారం చేసింది.

మరోవైపు ట్విట్టర్ లో కూడా ఇదే వీడియోను షేర్ చేశారు మరి కొంతమంది నెటిజెన్లు. చివరికి మంజులిక కూడా మెట్రో ట్రైన్ లో ప్రత్యక్షమైంది అంటూ ఈ వీడియో పోస్ట్ చేశారు. వైరల్‌ ట్విట్టర్‌ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిజ నిర్ధారణ

సోషల్ మీడియాలో వైరల్ గా సర్కులేట్ అవుతున్న ఈ వీడియో వెనుక నిజమెంత?! తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది. దీంతో మెట్రో ట్రైన్ లో చంద్రముఖి వేషధారణలో ఉన్న అమ్మాయితో పాటుగా మనీ హైయెస్ట్ పాత్ర ధరించిన మరొక వ్యక్తి కూడా ట్రైన్లో తిరిగాడని మరొక వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు కొంతమంది.

ఈ రెండు వీడియోలను ఆధారంగా చేసుకుని మరొకసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీవీ. వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఈ రెండు వీడియోలు నోయిడా మెట్రో రైల్ లో చిత్రీకరించారని, వాణిజ్య ప్రకటన కోసం మెట్రో రైల్ అధికారుల అనుమతి తీసుకున్నారని, అందువల్ల మెట్రో రైలులో చిత్రీకరించినా చర్యలు తీసుకునే అవకాశాలు లేవని ఆజ్ తక్ ఒక వార్తను ప్రచురించింది.

అయితే ఇందులో పూర్తి వివరాలు లేనందున మరొకసారి అడ్వాన్స్ గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. చంద్రముఖి సినిమా హిందీ వెర్షన్ భూల్ భులయ్య లో చంద్రముఖి పాత్ర - మంజులిక తో పాటుగా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్, మనీ హైయెస్ట్ పాత్రలు వేసుకున్న ఆర్టిస్టులతో ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ ఒక ప్రమోషనల్ వీడియో చిత్రీకరించారని, దానికి నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని ఒక వార్తా కథనం కనిపించింది.

నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ - రీతు మహేశ్వరి, ఈ వైరల్ వీడియోలతో పాటుగా, తీసుకున్న అనుమతులకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఈ వీడియోల షూటింగ్ డిసెంబర్ 22 2022లో జరిగినట్టుగా వెల్లడించారు.

మెట్రో రైల్లో చిత్రీకరించిన వీడియోలను బోట్ తన ఇంస్టా అకౌంట్ లో ఉంచింది.

బోట్ కంపెనీ కోసం ఈ యాడ్ షూట్ చేసిన Creative Productions తో కలిసి మంజులికగా నటించిన ఆర్టిస్ట్ ప్రియా గుప్తా మేకింగ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో ఉంచింది.


సో, బోట్ కంపెనీ మెట్రో రైలులో చిత్రీకరించిన ప్రమోషనల్ వీడియోను, చంద్రముఖి సోషల్ మీడియాలో, లైకుల కోసం మెట్రో ట్రైన్ లో ప్రత్యక్షమైంది అంటూ షేర్ చేస్తున్నారు.

Claim Review:ప్రమోషనల్ వీడియోను మెట్రోలో చంద్రముఖి ప్రత్యక్షమైందని షేర్ చేస్తున్నారు
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:Misleading
Next Story