డైనోసార్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. డైనోసార్లను చైనా విజయవంతంగా క్లోనింగ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
వైరల్ వీడియోలోని టెక్స్ట్ లో "చైనా మొదట కరోనావైరస్ ను సృష్టించింది.. ఇప్పుడు వారు డైనోసార్లను క్లోనింగ్ చేసి తిరిగి ఈ భూమి మీదకు తీసుకుని వచ్చారు." అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. వాయిస్ ఓవర్ లో.. ఉదాహరణకు, ఈ వీడియో ఒక సంవత్సరం క్రితం చైనా నుండి లీక్ అయింది, స్ట్రెచర్‌పై బేబీ ట్రైసెరాటాప్స్ డైనోసార్ ఉంది. శాస్త్రవేత్తలు నిజమైన డైనోసార్ యొక్క DNA, కణజాల అవశేషాలను ఉపయోగించి డైనోసార్ లను తిరిగి తయారు చేస్తున్నారని మూలం నివేదించింది. చైనా అధికారులు ఈ లీక్‌పై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్‌లు అంతరించిపోయాయనే వాస్తవాన్ని పరిశీలిస్తే, ఈ ఫుటేజ్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోలోని డైనోసార్‌లు తోలుబొమ్మలు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. సెప్టెంబర్ 2020 చివరలో, డైనోసార్ మూవీ ఫ్రాంచైజీకి సంబంధించిన ఫ్యాన్ వెబ్‌సైట్ అయిన జురాసిక్ అవుట్‌పోస్ట్ అదే వీడియోను ట్వీట్ చేసింది, “జురాసిక్ వరల్డ్ ది ఎగ్జిబిషన్‌కు కొత్తగా వచ్చిన ఈ పారాసౌరోలోఫస్‌ని చూడండి. !" అంటూ ట్వీట్ చేయడాన్ని మేము గుర్తించాం.
వైరల్ వీడియోలో డైనోసార్‌లు నిజమనిపించినప్పటికీ, అవి కేవలం తోలుబొమ్మలు మాత్రమే. వాటిని నియంత్రించడానికి మనిషి తన కుడి చేతిని ఉపయోగించడం చూడవచ్చు. థీమ్ పార్కులలో ఉపయోగించే సాంకేతికతతో యానిమేట్రానిక్ పప్పెట్‌ను రూపొందించింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ. ఈ రకమైన తోలుబొమ్మలు రోబోట్‌ల వలె ఉంటాయి. ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. డైనోసార్‌లు మళ్లీ ప్రాణం పోసుకోవడం లేదు.
"జురాసిక్ వరల్డ్: ది ఎగ్జిబిషన్" ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఇందులో కూడా ఇలాంటి డైనోసార్ తోలుబొమ్మను చూపుతుంది.
చైనాలో లేదా మరెక్కడైనా డైనోసార్‌ల క్లోనింగ్ విజయవంతమైనట్లు విశ్వసనీయ నివేదిక లేదా పరిశోధనను మేము కనుగొనలేకపోయాము. కాబట్టి, వైరల్ దావాలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
-Credits : Sunanda Naik