FactCheck : షిరిడి సాయి బాబా అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలేనా..?

Funeral of Ramana Maharshi Passed off as last rites of Shirdi Sai Baba. షిర్డీ సాయిబాబా అంత్యక్రియలకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Jan 2022 8:44 AM GMT
FactCheck : షిరిడి సాయి బాబా అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలేనా..?

షిర్డీ సాయిబాబా అంత్యక్రియలకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైరల్ ఫోటోలో భక్తులు, ఇతర ఋషులు మృతదేహాన్ని పూలమాలలతో కప్పి ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చూపబడింది. ఈ చిత్రాన్ని షిర్డీ సాయి బాబాకు అంకితం చేసిన ఫేస్‌బుక్ గ్రూప్‌లో భాగస్వామ్యం చేయబడింది. "ఓం సాయి రామ్‌జీ" అని క్యాప్షన్ చేయబడింది. పలువురు ఇతర సోషల్ మీడియా వినియోగదారులు కూడా దీన్ని షేర్ చేశారు.

https://www.facebook.com/groups/saibabaparivaar/permalink/1035453833735122/


నిజ నిర్ధారణ :

NewsMeter బృందం Yandexలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసింది. అదే చిత్రాన్ని కలిగి ఉన్న నవంబర్ 8, 2017లో చేసిన ఒక ట్వీట్‌ను కనుగొంది. "ఒక ఋషి చివరి రోజులు: హెన్రీ కార్టియర్-బ్రెస్సన్ 1950 ఏప్రిల్‌లో తమిళనాడులోని #తిరువణ్ణామలైలో రమణ మహర్షి యొక్క చివరి ఛాయాచిత్రాలను, అతని తదుపరి అంత్యక్రియలను బంధించారు" అని ఉంది.

"The final days of a sage: Henri Cartier-Bresson captured the last photographs of Ramana Maharshi and his subsequent funeral in #Tiruvannamalai, Tamil Nadu, in April of 1950. Cartier-Bresson also bore witness to a fireball that streaked across the sky during the moment of passing." అంటూ ట్వీట్ చేశారు.

దీనిని హింట్ గా ఉపయోగించి, NewsMeter మరింత సెర్చ్ చేసింది. ఫోటోగ్రఫీ వెబ్‌సైట్‌లు/గ్యాలరీలలో 'మాగ్నమ్ ఫోటోస్' మరియు 'రియలైజేషన్' లో అదే అంత్యక్రియల ఫోటోను కనుగొన్నారు. 1950లో మరణించిన హిందూ ఋషి శ్రీ రమణ మహర్షికి చెందినవిగా గుర్తించబడింది. చిత్రం తీయబడింది తిరువణ్ణామలై, తమిళనాడు అని తెలపడమే కాకుండా.. ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్-బ్రెస్సన్ ఈ చిత్రాలపై లైసెన్స్ పొందారు.

https://archive.ph/EFioi#selection-704.0-723.160

https://realization.org/p/ramana/ramana-photo-gallery.html


రమణ మహర్షి అధికారిక సైట్ నుండి ఆగస్టు 2014న Newsletter (పేజీ 2)లో కూడా ఇదే చిత్రం కనుగొనబడింది. రమణ మహర్షి ఒక భారతీయ హిందూ ఋషి. ఆయన తమిళనాడులోని తిరుచూలిలో జన్మించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరుతో ఆయనను పిలుస్తారు.



వైరల్ పిక్చర్ రమణ మహర్షి అంత్యక్రియలను చూపుతోంది. అందులో ఉన్నది షిర్డీ సాయిబాబా కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:షిరిడి సాయి బాబా అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story