భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, భారత్ కు వరల్డ్ కప్ అందించిన మొదటి కెప్టెన్ కపిల్ దేవ్ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కపిల్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 23న మరణించాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి.నిజ నిర్ధారణ:

కపిల్ దేవ్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

కొద్దిరోజుల కిందట కపిల్ దేవ్ కు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేశారు. కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కపిల్ దేవ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ‍్క్షతలు తెలిపారు. యాంజియోప్లాస్టీ నిర్వహించిన అనంతరం ఆయన్ను కొద్దిరోజుల పాటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అక్టోబర్ 25న కపిల్ దేవ్ ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. కపిల్ దేవ్ స్నేహితుడు, మాజీ టీమ్ మేట్ అయిన చేతన్ శర్మ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కపిల్ దేవ్ బాగున్నారని.. ఆయన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారని వెల్లడించాడు. డాక్టర్ అతుల్ మాథుర్ కపిల్ దేవ్ కు యాంజియోప్లాస్టీ నిర్వహించారని అన్నారు.కపిల్ దేవ్ సొంతంగా ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తాను బాగుండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని.. నా సన్నిహితులందరినీ త్వరలోనే కలుస్తానని వెల్లడించారు.


నవంబర్ 2న ఏబీపీ న్యూస్ లో కపిల్ దేవ్ కనిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ కి పలు సూచనలు చేశాడు కపిల్. Hindustan Times లో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై కథనాలను రాశారు. మహేంద్ర సింగ్ ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడాలని అనుకుంటే.. ఇక్కడ అతడు రాణించడం అసాధ్యం. వయసు కూడా ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు కపిల్.

కపిల్ దేవ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


సామ్రాట్

Next Story