ఆగస్టు 26న జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఐదు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. పార్టీలో చోటు చేసుకున్న అన్యాయాలను, ఓ వర్గం ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు. రాహుల్ గాంధీని అపరిపక్వత కలిగిన వ్యక్తిగా నిందించారు. సీనియర్ నాయకులతో కనీసం సంప్రదింపులు జరపలేదని విమర్శించారు.
జమ్మూ కశ్మీర్‌లో ఆజాద్ తన పార్టీని స్థాపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సూచనల మేరకు ఆయన పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా (R&AW) సమంత్ కుమార్ గోయెల్, గులాం నబీ ఆజాద్‌లతో కూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్‌ను వీడే ముందు అమిత్ షా, సమంత్ కుమార్ గోయెల్ లను ఆజాద్ కలిశారని ప్రచారం జరుగుతోంది.
"గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టడానికి చాలా కాలం ముందు సమంత్ కుమార్ సమక్షంలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని వారు వాగ్దానం చేశారు" (गुलाम नबी आजाद ने कांग्रेस पार्टी छोड़ने से काफी पहले सामंत कुमार की मौजूदगी में गृह मंत्री अमित शाह से मुलाकात की थी। वास्तव में उन्हें तब मॉडिफाइड किया गया था जब उन्हें पीएम से तीसरा सर्वोच्च नागरिक पुरस्कार पद्म भूषण पुरस्कार मिला था और उन्हें RS सीट का वादा किया गया था।) అంటూ ట్వీట్ ను పోస్టు చేశారు.
పోస్ట్‌ను యాక్సెస్ చేయడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
చాలా మంది ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ వినియోగదారులు ఇదే దావాతో ఫోటోను పంచుకున్నారు.
పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
NewsMeter బృందం వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఇలాంటి చిత్రంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన పాత ట్వీట్‌ని మేము చూశాము. అందులో అమిత్ షా, ఫడ్నవీస్.. గోవా ఎమ్మెల్యే మైఖేల్ లోబో చిత్రంలో కూర్చున్నట్లు చూడవచ్చు.
వైరల్ ఫోటోను అడ్డంగా తిప్పినప్పుడు, అది ఫడ్నవీస్ పోస్ట్ చేసిన ఇమేజ్‌తో సమానంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము.
మా పాఠకులకు ఈ ఫోటో వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలియజేయడానికి అందులోని సారూప్యతలను హైలైట్ చేసాము.
మార్ఫింగ్ చేసిన ఫోటోకు.. ఒరిజినల్ ఫోటోకు ఉన్న తేడాలను గమనించవచ్చు.
అనేక సారూప్యతలతో పాటు, మణికట్టు స్థానాలు, పాదాలు.. వంటివి మనం గమనించవచ్చు. మార్ఫింగ్ చేసిన ఫోటోలో గోయెల్ మణికట్టుపై ఉన్న బ్యాండ్‌లు ఫడ్నవీస్ మణికట్టుపై ఉన్న బ్యాండ్‌ల మాదిరిగానే ఉన్నాయని కూడా మేము గమనించాము.
దేవేంద్ర ఫడ్నవీస్, మైఖేల్ లోబో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన పాత ఫోటోను మార్ఫింగ్ చేసి గులాం నబీ ఆజాద్ పై వ్యతిరేక ప్రచారం కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఈ వైరల్ ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది.