FactCheck : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారా..?

Fake news alert Elon Musk did not tweet against Pak PM. ట్విట్టర్‌లో నకిలీ ఫాలోవర్లు ఉన్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎలోన్ మస్క్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Dec 2022 8:21 PM IST
FactCheck : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారా..?

ట్విట్టర్‌లో నకిలీ ఫాలోవర్లు ఉన్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎలోన్ మస్క్ విమర్శిస్తూ చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

'More than 60 percent of #PTI Chief #ImranKhan's followers were fake and they have been removed from his account by #Twitter after #ElonMusk's crackdown on fake accounts on bots', అని స్క్రీన్ షాట్ లో ఉంది.


స్క్రీన్‌షాట్‌కు సంబంధించిన క్యాప్షన్ లో "పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో అత్యధిక సంఖ్యలో నకిలీ ఫాలోవర్లను కలిగి ఉన్నారని నేను ధృవీకరిస్తున్నాను." అని ఉంది.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఎలాన్ మస్క్ నిజంగా అలాంటి ప్రకటన చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

నిజ నిర్ధారణ :

మేము వైరల్ స్క్రీన్‌షాట్‌ను జాగ్రత్తగా విశ్లేషించాము. తేదీ డిసెంబర్ 13, 2022 అని గమనించాము. డిసెంబర్ 13న ఎలోన్ మస్క్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ని స్క్రోల్ చేయగా.. అలాంటి ట్వీట్ ఏదీ కనుగొనబడలేదు.

అంతేకాకుండా, ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను కూడా మేము కనుగొనలేకపోయాము. ఎలాన్ మస్క్ ఇమ్రాన్ ఖాన్ పై అలాంటి ఏదైనా వ్యాఖ్యలు చేసి ఉంటే ఖచ్చితంగా అవి పెద్ద ఎత్తున మీడియాను ఆకర్షించేది.

ఇమ్రాన్ ఖాన్‌కు 60.8% నకిలీ అనుచరులు ఉన్నారని చెప్పడంలో నిజం లేదు. మేము వైరల్ స్క్రీన్‌షాట్‌లో ఉపయోగించిన అదే వివరాలు తెలుసుకోవడం కోసం Sparkroroని ఉపయోగించాము.

ఇమ్రాన్ ఖాన్ కు కేవలం 2.7 శాతం నకిలీ అనుచరులు ఉన్నారని మేము కనుగొన్నాము, అంటే నకిలీ ట్వీట్‌లోని డేటాను ఎడిట్ చేశారు.



పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వైరల్ స్క్రీన్ షాట్ నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది.

వైరల్ దావా తప్పుగా ఉంది.


Claim Review:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story