బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ప్రకారం.. ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలపై 200 పైగా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.
ఈ అశాంతి మధ్య బంగ్లాదేశ్‌లోని ముస్లింలు అత్యాచారం చేసి హిందూ మహిళలను చంపారంటూ ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను (హెచ్చరిక: కలతపెట్టే విజువల్స్) షేర్ చేశారు. “బంగ్లాదేశ్‌లో ముస్లింలు అత్యాచారం చేసి.. హిందువులను చంపేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఏమైపోయాయి. మానవత్వం అంటూ ఢంకా బజాయించే దేశాలు వారిని ఎందుకు రక్షించడం లేదు!? UNHRC ఎక్కడ ఉంది?" అంటూ పోస్టులు పెట్టారు. (అర్కైవ్)
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడియోను వైరల్ చేశారు. (అర్కైవ్), (అర్కైవ్)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్ మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన భోలే బాబా సత్సంగంలో తొక్కిసలాట జరిగి 122 మంది మరణించిన తర్వాత జరిగిన పరిణామాలను వీడియో చూపించిందని క్యాప్షన్ లో గుర్తించాం.
దీంతో ఆ వీడియో పాతదేనని తేలింది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా.. న్యూస్18 జూలై 2, 2024 కథనాన్ని గుర్తుంచామ్. ‘50 వేల మంది హాజరయ్యారు, చనిపోయిన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు: హత్రాస్ ట్రాజెడీ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు’ అనే శీర్షికతో నివేదికను చూశాం.
జూలై 2, 2024న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన మతపరమైన సమావేశంలో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది మహిళలు, పిల్లలతో సహా కనీసం 116 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. 'సత్సంగ్' సందర్భంగా ఈ సంఘటన జరిగింది. స్థానిక గురువు భోలే బాబా ప్రవచనాల కార్యక్రమానికి 50,000 మంది ప్రజలు హాజరయ్యారు.
నివేదికలోని ఫోటో వైరల్ వీడియోలో చూసిన వారినే చూపుతుంది.
ఇండియా టుడే మరో నివేదిక జూలై 15, 2024న ఈ సంఘటన గురించి కథనంలో తెలిపారు. ఆ సమయంలో మరణించిన వారి సంఖ్య 123 మంది అని తెలిపారు.
ఈ నివేదిక కూడా వైరల్ వీడియోలో కనిపించే అదే మహిళలను చూపిస్తుంది.
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఈ ఫుటేజీ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించింది.
Credit: Sibahathulla Sakib