నిజమెంత: రాయ్ బరేలీలో కుంభమేళా పోస్టర్‌పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడనే వాదనలో నిజం లేదు

ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కోట్లలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jan 2025 9:15 AM IST
FactCheck, Muslim man, urinating, Kumbh Mela poster, Rae Bareli

నిజమెంత: రాయ్ బరేలీలో కుంభమేళా పోస్టర్‌పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడనే వాదనలో నిజం లేదు

ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కోట్లలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.

ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు అసభ్య పదజాలంతో తిడుతూ, దాడి చేసిన వీడియో బయటపడింది. వీడియోను షేర్ చేస్తున్న వారు దాడికి గురైన వ్యక్తి ముస్లిం వ్యక్తి అని సోషల్ మీడియా పోస్టుల్లో తెలిపారు. గోడపై అతికించిన మహా కుంభమేళా పోస్టర్ మీద ఉన్న హిందూ దేవతల ఫోటోలపై మూత్ర విసర్జన చేసినందుకు స్థానికులు పట్టుకున్నారని పోస్టుల్లో ఆరోపించారు.

ఒక X వినియోగదారు, బాబా బనారస్ ఈ వీడియోను పంచుకున్నారు. “రాయ్ బరేలీ, UP: అబ్దుల్ మహాకుంభ్ హిందూ దేవతల ఫోటోలపై మూత్ర విసర్జన. అతడిని స్థానికులు పట్టుకున్నారు. (sic)” అంటూ పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వీడియో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందినది కాగా, మూత్ర విసర్జనకు పాల్పడిన వ్యక్తి హిందూ సమాజానికి చెందినవాడని మా విచారణలో తేలింది.

మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. జనవరి 11న ప్రచురించిన అమర్ ఉజాలా, ఇండియా డైలీ నివేదికలను కూడా కనుగొన్నాము. ఈ రెండు నివేదికలు దాడికి సంబంధించిన వైరల్ వీడియో నుండి విజువల్స్ ను తీసుకున్నాయి.

ఈ నివేదికల ప్రకారం ఈ సంఘటన జనవరి 10, 2025 సాయంత్రం, రాయ్‌బరేలీలోని బచ్రావాన్ పట్టణం ప్రధాన కూడలి వద్ద జరిగింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దాడి చేయగా, సంఘటనా స్థలంలో ఉన్న ఎవరో ఈ ఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నివేదికలో నిందితుడి పేరు లేదా అతనికి సంబంధించిన వివరాలు పేర్కొనలేదు. అయితే, వైరల్ వీడియోపై దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ OP తివారీ తెలిపారు.

మేము అదే మతపరమైన దావాతో వీడియోను మరొక X వినియోగదారుని పోస్టును కూడా కనుగొన్నాము. అయితే, రాయ్‌బరేలీ పోలీసుల ఎక్స్ హ్యాండిల్ పోస్ట్‌కు సమాధానం ఇచ్చింది. వీడియోలో దాడికి గురైన వ్యక్తి కన్నౌజ్ జిల్లాకు చెందిన వినోద్ అనే వ్యక్తి అని, అతను మత్తులో, కుంభ్ పోస్టర్ ఉందని తెలియక గోడ దగ్గర మూత్ర విసర్జన చేశాడని పోలీసులు తెలిపారు. వినోద్ వేరే వర్గానికి చెందినవాడన్న వాదన అవాస్తవమని, నిరాధారమని పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ బచ్‌రావాన్ SHO OP తివారీని సంప్రదించింది. నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడనే వాదనను ఆయన తోసిపుచ్చారు. నిందితుడి పేరు వినోద్ అని, అతను హిందూ సమాజానికి చెందినవాడని ఆయన స్పష్టం చేశారు.

బచ్రావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు వినోద్ అలియాస్ దినేష్‌ను చట్ట ప్రకారం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు ధృవీకరించారు.

యుపిలోని రాయ్‌బరేలీలో కుంభమేళా పోస్టర్‌పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడన్న వాదన అవాస్తవమని మేము నిర్ధారించాము.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Md Mahfooz Alam

Next Story