FactCheck: నటి దివ్య స్పందన చనిపోలేదు.. వైరల్ పోస్టుల్లో నిజం లేదు

నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2023 7:30 AM IST
FactCheck, Actress Divya Spandana, Fake news, NewsMeterFactCheck

FactCheck: నటి దివ్య స్పందన చనిపోలేదు.. వైరల్ పోస్టుల్లో నిజం లేదు 

నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

“Shocking News: Actress Divya Spandana passed away due to Heart Attack” Just couldn’t believe. Is this true ??? Or Fake news ???” అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.

దివ్య స్పందన హార్ట్ అటాక్ తో చనిపోయారు.. ఈ విషయం నిజమా కాదా అంటూ ఆమె అభిమానులు, పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ బృందం వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదని కనుగొంది.

మేము కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించాము. దివ్య స్పందన మరణ వార్త ఫేక్ అని స్పష్టం చేస్తూ ది న్యూస్ మినిట్ ఎడిటర్-ఇన్-చీఫ్ ధన్య రాజేంద్రన్ చేసిన పోస్ట్‌ను చూశాము.

“It was really the strangest conversation, kept calling @divyaspandana and she didn't pick first few times and naturally I was panicking. Finally, she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died!" అంటూ పోస్టు పెట్టారు.

దివ్య స్పందన చనిపోలేదని.. ఆమె తనతో మాట్లాడినట్లు తెలిపారు.

'Divya Spandana alive and fine' అంటూ ఇండియా టుడే న్యూస్ లో వచ్చిన వార్తను కూడా గుర్తించాం. ఆమె చనిపోలేదని బ్రతికే ఉన్నారని పలు కన్నడ మీడియా సంస్థలు తెలిపాయి.

దక్షిణాది నటి, మాజీ లోక్‌సభ సభ్యురాలు దివ్య స్పందన మృతి చెందారనే ప్రచారం అవాస్తవమని NDTV నివేదిక స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకురాలు సజీవంగా ఉన్నారని, జెనీవా పర్యటనలో ఉన్నారని పేర్కొంది.

కాబట్టి, దివ్య స్పందన మృతికి సంబంధించిన వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

credits: Md Mahfooz Alam

Claim Review:నటి దివ్య స్పందన చనిపోలేదు.. వైరల్ పోస్టుల్లో నిజం లేదు
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story