నిజమెంత: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత హిందువులను భారతదేశం విడిచి వెళ్లమని మౌలానా మదానీ కోరలేదు

మాజీ రాజ్యసభ సభ్యుడు, జమియత్ ఉలమా-ఐ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 July 2024 10:00 AM IST
NewsMeterFactCheck, Maulana Mahmood Asad Madani , BJP

నిజమెంత: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత హిందువులను భారతదేశం విడిచి వెళ్లమని మౌలానా మదానీ కోరలేదు 

మాజీ రాజ్యసభ సభ్యుడు, జమియత్ ఉలమా-ఐ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో “ఈ దేశం మనది, దేశం పట్ల మనకు బాధ్యత ఉండాలి. మన మతం, వేషధారణ, మర్యాదలు, ఆహారపు అలవాట్లు వేరు. మీరు మా మతాన్ని సహించలేకపోతే, మీరు వేరే చోటికి వెళ్లాలి." అని అన్నట్లుగా ఉంది.

ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇటీవలిదని అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.భారతీయ జనతా పార్టీ (BJP) 2024 లోక్‌సభ ఎన్నికలలో 240 సీట్లు గెలుచుకున్న తర్వాత, మెజారిటీకి తక్కువగా పడిపోవడంతో హిందువులను భారతదేశం విడిచి వెళ్లమని మదానీ చెప్పారంటూ పోస్టులు ప్రచారం చేస్తున్నారు.

“బీజేపీ మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. హిందువులను బెదిరించడం, హిందువులను భారతదేశం విడిచిపెట్టమని అడగడం ప్రారంభించారు. PFI గజ్వా-ఇ-హింద్-20247 లక్ష్యాన్ని సాధించడానికి వారు సరైన దిశలో ఉన్నామని వారు భావిస్తున్నారు. హే డివైడెడ్ హిందువులారా, మీ కోసం కొత్త స్థలాన్ని చూసుకోండి లేదా మతం మార్చుకోండి” అని వీడియోను షేర్ చేసిన X వినియోగదారు రాశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

ఈ వీడియో 2022 నాటిది. ఇటీవలిది కాదు.

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని NewsMeter కనుగొంది.

వైరల్ వీడియోలో టీవీ9 ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లోగో ఉంది. ఈ సూచనను తీసుకొని.. మేము TV9 ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ యూట్యూబ్ ఛానెల్‌లో నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. మే 31, 2022న అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము.

మే 29, 2022న మరొక ధృవీకరించబడిన ఛానెల్ Millat Times ప్రచురించిన వీడియోను కూడా చూశాం. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియోలోని బ్యానర్‌లో మదానీ జమియత్ ఉలమా-ఐ-హింద్ జాతీయ పాలక సమావేశంలో మాట్లాడుతున్నట్లు గమనించాం. వైరల్ క్లిప్ ఈ వీడియోలో 2:16 నిమిషాల మార్క్‌లో కనిపిస్తుంది.

మదానీ మాట్లాడుతూ.. నేను బెదిరించడం లేదు. కానీ ఈ దేశం మాది కూడా అని తెలియజేసినట్లు వీడియోలో చెప్పాడు. అప్పట్లో మాకు అవకాశం ఉంది కానీ మేము పాకిస్తాన్‌ కు వెళ్ళలేదు. మేము ఈ దేశ పౌరులం, విదేశీయులు కాదు. మమ్మల్ని ఇష్టపడని వారు కావాలంటే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు.

మే 2022లో హిందుస్థాన్, జాగ్రన్ నివేదించిన మదానీ ప్రకటనను కూడా మేము కనుగొన్నాము.

మౌలానా మహమూద్ అసద్ మదానీ వైరల్ వీడియో 2022 నాటిదని మేము నిర్ధారించాము. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో హిందువులను భారతదేశం విడిచిపెట్టమని ఆయన కోరలేదు.

Credits: Md Mahfooz Alam

Next Story