నిజమెంత: ఉదయ్ పూర్ ఫ్రెంచ్ టూరిస్ట్ పై లైంగిక వేధింపుల కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన ముబాసిర్ ఖాన్ పట్టుబడ్డారా?

జూన్ 22న ఉదయపూర్‌లో ఒక యాడ్ చిత్రీకరణ కోసం వచ్చిన 29 ఏళ్ల ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. జూన్ 23న ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Jun 2025 1:45 PM IST

NewsMeterFactcheck, Rajasthan, Udaipur

నిజమెంత: ఉదయ్ పూర్ ఫ్రెంచ్ టూరిస్ట్ పై లైంగిక వేధింపుల కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన ముబాసిర్ ఖాన్ పట్టుబడ్డారా?

జూన్ 22న ఉదయపూర్‌లో ఒక యాడ్ చిత్రీకరణ కోసం వచ్చిన 29 ఏళ్ల ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. జూన్ 23న ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అక్రమ బంగ్లాదేశ్ ముస్లిం అయిన ముబాసిర్ ఖాన్ అనే వ్యక్తి ఫ్రెంచ్ మహిళపై దాడి చేశాడని, అతడిని అరెస్టు చేశారని సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు.

ఒక X యూజర్ “భారతదేశ ప్రసిద్ధ పర్యాటక నగరమైన ఉదయపూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై స్థానికుడు అత్యాచారం చేశాడు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.” అని ఉంది.

దీనికి ప్రతిస్పందనగా హిందూత్వ నైట్ అనే మరో యూజర్ పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి చిత్రాన్ని షేర్ చేసి, “ముబాసిర్ ఖాన్ అనే అక్రమ బంగ్లాదేశ్ ముస్లింను UP పోలీసులు అరెస్టు చేశారు.” అని పేర్కొన్నారు.

అదే వాదనతో పలువురు పోస్టులను షేర్ చేశారు

నిజ నిర్ధారణ:

ఫ్రెంచ్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్ ఓజాగా పోలీసులు గుర్తించారు. దీంతో న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

మేము కీవర్డ్ శోధన నిర్వహించి, జూన్ 26న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదికను కనుగొన్నాము. నివేదిక ప్రకారం, 29 ఏళ్ల కాస్టింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్ ఓజా ఒక యాడ్ షూటింగ్ కోసం ఉదయపూర్‌కు వెళ్లిన ఫ్రెంచ్ మహిళపై దాడి చేసినందుకు అరెస్టు చేయబడ్డాడు.

జూన్ 22 రాత్రి పిచోలా సరస్సు సమీపంలో ఇద్దరూ భోజనం చేసిన తర్వాత ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సిగరెట్ బ్రేక్ నెపంతో ఓజా ఆ మహిళను సుఖేర్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడని, అక్కడ దాడి జరిగిందని వివరించారు.

జూన్ 23న బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జూన్ 25న చిత్తోర్‌గఢ్ హైవే గుండా పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఓజాను పోలీసులు అరెస్టు చేశారు. అతను మొదట దీనిని 'హనీ-ట్రాప్' అని చెప్పినప్పటికీ తరువాత నేరం అంగీకరించాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్తాన్ టైమ్స్, NDTV నివేదికలను కూడా మేము కనుగొన్నాము. ఈ నివేదికలు నిందితుడిని పుష్పరాజ్ ఓజా అలియాస్ సిద్ధార్థ్‌గా తెలిపాయి.

ముబాసిర్ ఖాన్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారా?

పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి కి సంబంధించిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూన్ 23న బరేలీ పోలీసులు పోస్ట్ చేశారు, అందులో అధికారిక ప్రెస్ నోట్‌తో పాటు అదే చిత్రం కూడా ఉంది.

ఆ పోస్ట్ ప్రకారం, జూన్ 21న, ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ పురం సమీపంలోని కోచింగ్ సెంటర్‌కు వెళుతుండగా 22 ఏళ్ల వ్యక్తి ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. ఫుటేజ్ ఆధారంగా, నిందితుడిని ముసాబ్బీర్‌గా గుర్తించారు.

పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ముసాబ్బీర్ అధికారులపై కాల్పులు జరిపాడని ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపగా, ఆ సమయంలో అతని కాలికి తూటా గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు. అతని వద్ద నుండి .315-బోర్ కంట్రీ-మేడ్ పిస్టల్, కార్ట్రిడ్జ్‌లు, నంబర్ ప్లేట్ లేని మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముసాబ్బీర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS), POCSO చట్టంలోని బహుళ సెక్షన్ల కింద, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు.

బరేలీలో జరిగిన వేరే లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముసాబ్బీర్‌ను అరెస్టు చేశారని ఇది నిర్ధారించింది. అందువల్ల, ఉదయపూర్‌లో ఫ్రెంచ్ మహిళపై ముబాసిర్ ఖాన్ అనే బంగ్లాదేశ్ వ్యక్తి దాడి చేశాడనే వాదన అబద్ధమని మేము నిర్ధారించాము.

Claim Review:ఉదయ్ పూర్ ఫ్రెంచ్ టూరిస్ట్ పై లైంగిక వేధింపుల కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన ముబాసిర్ ఖాన్ పట్టుబడ్డారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story