నిజమెంత: రాహుల్ గాంధీ ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారా?

ఇటీవల జరిగిన కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Aug 2024 9:28 AM IST
NewsMeterFactCheck, Rahul Gandhi, Krishnashtami celebrations

నిజమెంత: రాహుల్ గాంధీ ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారా? 

ఇటీవల జరిగిన కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఒక X వినియోగదారుడు “ రాహుల్ గాంధీ జీ నుండి జన్మాష్టమి శుభాకాంక్షలు...” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్)

27 సెకన్ల క్లిప్‌లో గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆలయంలో నడుస్తూ కనిపించారు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్టులు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ ఉన్నాయి. (ఆర్కైవ్), (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని న్యూస్‌మీటర్ కనుగొంది. వీడియో పాతది. జన్మాష్టమి వేడుకలలో రాహుల్ గాంధీ పాల్గొన్నట్లు చూపించలేదు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 19 ఆగస్టు 2022న Lutyens Media షేర్ చేసిన అదే వీడియో కలిగి ఉన్న X పోస్ట్‌ ని చూశాం. “కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరఫున ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు!!" అంటూ ఓ పోస్టును మేము చూశాం.

దీంతో ఆ వీడియో పాతదేనని స్పష్టంగా తెలుస్తోంది.

కీవర్డ్స్ సెర్చ్ చేయగా, ఫిబ్రవరి 26, 2022న NDTV ప్రచురించిన రిపోర్ట్‌కి దారితీసింది. ‘In Gujarat For Congress Strategy Meet, Rahul Gandhi Visits A Temple.’ అనే టైటిల్ తో కథనాన్ని ప్రసారం చేశారు. దీన్ని బట్టి ఇది గుజరాత్ లో జరిగిన ఘటన అని తెలుస్తోంది.

కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం కోసం గాంధీ గుజరాత్ వచ్చినప్పుడు ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించినట్లు నివేదిక పేర్కొంది. ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేశారని నివేదికలో తెలిపారు.

జన్మాష్టమిని పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత ఆలయాన్ని సందర్శించిన ప్రసక్తే అందులో లేదు.

ANI న్యూస్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఫిబ్రవరి 26, 2022న అప్‌లోడ్ చేసిన వీడియో నివేదికను మేము కనుగొన్నాము. ‘గుజరాత్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించారు.’ అంటూ పోస్టు పెట్టారని మేము గమనించాం.

వీడియో క్యాప్షన్ లో “కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 26న గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించారు. ఆయన ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ తన పర్యటన సందర్భంగా ద్వారకలోని చింతన్ శివిర్‌లో కూడా ప్రసంగించారు." అని ఉంది.

అంతేకాకుండా, రాహుల్ గాంధీ ఆలయాన్ని సందర్శించిన చాలా నెలల తర్వాత 2022లో ఆగస్టు 18-19 తేదీల్లో కృష్ణ జన్మాష్టమిని జరుపుకున్నారు. ఈ వీడియో జన్మాష్టమి వేడుకలకు సంబంధించినది అనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

రాహుల్‌ గాంధీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగమైనట్లు వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఫిబ్రవరి 2022 నాటి ఫుటేజీ గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించినప్పటిది. జన్మాష్టమి వేడుకలకు ఎటువంటి సంబంధం లేదు.

Credit: Sibahathulla Sakib

Claim Review:రాహుల్ గాంధీ ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Facebook
Claim Fact Check:False
Next Story