నిజమెంత: గాజాకు సాయాన్ని చైనా ఎయిర్ డ్రాప్ చేసిందా?

ఇజ్రాయెల్-గాజా వివాదం కొనసాగుతున్న సందర్భంలో, గాజాలో పారాచూట్‌ల ద్వారా ఒక విమానం గాలిలో నుండి కొన్ని వస్తువులను జారవిడుచుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 May 2025 12:30 PM IST

NewsMeterFactCheck, China, USA, Gaza

నిజమెంత: గాజాకు సాయాన్ని చైనా ఎయిర్ డ్రాప్ చేసిందా? 

ఇజ్రాయెల్-గాజా వివాదం కొనసాగుతున్న సందర్భంలో, గాజాలో పారాచూట్‌ల ద్వారా ఒక విమానం గాలిలో నుండి కొన్ని వస్తువులను జారవిడుచుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వస్తువులను తీసుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలోని వైరల్ వీడియో చూస్తే అర్థం అవుతోంది. చైనా సహాయం అందిస్తోందనే వాదనతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

"ధన్యవాదాలు #చైనా" అనే శీర్షికతో (ఆర్కైవ్) ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేశారు. వీడియోలోని టెక్స్ట్ "ఈరోజు చైనా విమానాలు ఇజ్రాయెల్ ప్రభుత్వ దిగ్బంధనను బద్దలు కొట్టి ఆహారం అందించడానికి గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించాయి." అని ఉంది.

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

2024లో గాజాలో అమెరికా వైమానిక సహాయాన్ని వదిలివేసిన వీడియోను చూపిస్తున్నారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా మార్చి 26, 2024న టర్కిష్ వెబ్‌సైట్ యెని సఫాక్ ప్రచురించిన వీడియోలో అదే దృశ్యాలు కనిపించాయని తేలింది. వెబ్‌సైట్ ఏ దేశం సహాయాన్ని వదిలిపెట్టిందని పేర్కొనకపోయినా, వాయుమార్గాన జరిగిన సహాయం అని తెలిపింది. ఉత్తర గాజాలో ఇది జరిగిందని, అయితే ఎక్కువ భాగం సముద్రంలో పడిపోయిందని పేర్కొంది.

‘గాజా బీచ్‌లో ఎయిర్ డ్రాప్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ పన్నెండు మంది మునిగిపోయినట్లు నివేదించబడింది’ అనే శీర్షికతో అదే తేదీన ప్రచురించిన ది గార్డియన్ నివేదికలో కూడా మేము టవర్ కు సంబంధించిన అదే దృశ్యాన్ని కనుగొన్నాము.

ఆ నివేదిక ప్రకారం, ఎయిర్ డ్రాప్ నుండి స్వాధీనం చేసుకున్న కాగితం ముక్కలో అమెరికన్ జెండాపై అరబిక్ టెక్స్ట్ ఉన్నాయి. దీన్ని బట్టి ఆ సాయం యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిందని సూచిస్తుంది.

మార్చి 26, 2024 నాటి CNN నివేదిక కూడా, సముద్రంలో విమానం నుండి పడిపోయిన పార్శిల్‌లను తిరిగి పొందేందుకు ప్రయత్నించినప్పుడు గాజా తీరంలో 12 మంది మునిగిపోయారని పాలస్తీనా పారామెడిక్స్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత, హమాస్ ఎయిర్ డ్రాప్‌లను ఖండించింది. వాటిని నిలిపివేయాలని పిలుపునిచ్చింది.

గాజాకు చైనా సహాయం అందిస్తోందనే వాదనలను కూడా మేము పరిశీలించాము, కానీ ఈ ప్రాంతంలో చైనా ఏదైనా ఎయిర్ డ్రాప్‌లను నిర్వహించిందని నిర్ధారించే విశ్వసనీయ నివేదికలు ఏవీ మాకు లభించలేదు.

అందువల్ల, చైనా గాజా ప్రజల కోసం వస్తువులను విమానం ద్వారా వదిలి పెట్టలేదని మేము నిర్ధారించాము.

ఈ వాదన తప్పుదారి పట్టించేదని నిర్ధారించాం.

Credit: Mahfooz Alam

Claim Review:నిజమెంత: గాజాకు సాయాన్ని చైనా ఎయిర్ డ్రాప్ చేసిందా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story