నిజమెంత: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు అయ్యన్న పాత్రుడు చింతకాయల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 July 2024 3:45 PM ISTనిజమెంత: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు అయ్యన్న పాత్రుడు చింతకాయల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నట్లు ఆ పోస్టులు ఉన్నాయి. చెత్తపై పన్ను విధించినందుకు మరికొన్ని పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నట్లు సూచిస్తున్నాయి.
"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బూతులు తిడుతున్న అయ్యన్న" అంటూ ట్విట్టర్ యూజర్ పోస్టులు పెట్టారు. (ఆర్కైవ్)
"సంకీర్ణ ప్రభుత్వం చెత్తపై రూ. 90 పన్ను విధించింది" అని వీడియోను షేర్ చేసిన మరో ఎక్స్ వినియోగదారు రాశారు . ( ఆర్కైవ్ )
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో సెప్టెంబరు 2021 నాటిది. APలోని అప్పటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ప్రభుత్వాన్ని టీడీపీ నాయకుడు విమర్శిస్తున్నారని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్‌కి సంబంధించిన రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా.. అది వెరిఫై చేయబడిన యూట్యూబ్ ఛానెల్ మహా న్యూస్ ద్వారా సెప్టెంబర్ 18, 2021న అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము. అయ్యన్న పాత్రుడు YSRCP ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు వీడియో టైటిల్ ఉంది.
సెప్టెంబర్ 17, 2021న టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అప్లోడ్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు వ్యంగ్య వ్యాఖ్యలతో జగన్ పరిపాలనను విమర్శించారని పేర్కొన్నారు. నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో, టీడీపీ నాయకుడు అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని చూడవచ్చు. ఏపీ కేబినెట్‌లోని కొంతమంది మంత్రుల పేరును ప్రస్తావించారు. అప్పట్లో టీడీపీ నేత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు రుజువైంది.
సెప్టెంబర్ 18, 2021 నాటి న్యూస్ మినిట్ నివేదిక ప్రకారం.. చెత్త పన్నును ప్రవేశపెట్టినందుకు ప్రతిస్పందనగా టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ రెడ్డి, ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులను విమర్శించారు. ఇతర వైఎస్సార్‌సీపీ నేతలపై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, మద్దతుదారులు నిరసనకు దిగారు.
అక్టోబర్ 2, 2021న, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్రం చేపట్టిన పట్టణ సంస్కరణలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. CLAP కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలోని పౌర సంస్థలు మురికివాడల్లో ప్రతి ఇంటికి నెలకు రూ. 30, వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్‌లకు రూ. 120 వసూలు చేస్తున్నాయి. వ్యాపార సంస్థలకు ఛార్జీలు రూ.200 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి.
అందువల్ల, వైరల్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదని మేము నిర్ధారించాము.
Credit: Md Mahfooz Alam