FactCheck: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?

టెల్ అవీవ్‌ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2024 12:41 PM GMT
NewsMeterFactCheck, Tel Aviv, Fire, Iran, Israel

నిజమెంత: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా? 

ఇరాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు గురైన నేపథ్యంలో.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ.. ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఉద్రిక్తతల మధ్య.. టెల్ అవీవ్‌ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక X వినియోగదారు "బ్రేకింగ్: TEL AVIV IS ON FIRE" అనే శీర్షికతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము Xలో అదే వీడియోని కనుగొన్నాము,

“హిజ్బుల్లాహ్ అధికారిక ప్రకటన: మేము మా అగ్నిమాపక షెడ్యూల్‌కు కొత్త సెటిల్‌మెంట్ 'బీట్ హిల్లాల్'ని జోడించాము. దానిపై మొదటిసారి బాంబు దాడి చేసాము. డజన్ల కొద్దీ 'కటియుషా' రాకెట్లతో దాడి చేశాం.” (అరబిక్ నుండి అనువదించబడింది) అంటూ పోస్టుని గమనించాం.

నవంబర్ 2, 2023న ది ఇన్‌సైడర్ పేపర్ క అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసిన అదే వైరల్ వీడియోను మేము కనుగొన్నాము, "బ్రేకింగ్: ఇజ్రాయెల్‌లోని కిర్యాత్ ష్మోనాలో లెబనాన్ నుండి రాకెట్ దాడి జరిగింది. భారీ అగ్నిప్రమాదం, ఆస్తి నష్టం జరిగింది." అంటూ అందులో తెలిపారు.

ఈ సాక్ష్యాలను బట్టి.. ఈ వీడియో పాతదేనని తేలింది.

హిజ్బుల్లా చేసిన ప్రతీకార దాడిలో.. బీట్ హిల్లెల్ ప్రాంతం, ఎగువ గెలీలీ సెటిల్‌మెంట్‌పై దాడులు జరిగాయని మేము కీవర్డ్ సెర్చ్ చేసి కనుగొన్నాం.

నివేదిక ప్రకారం, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి తరువాత హిజ్బుల్లా 50 కటియుషా రాకెట్లను ఉత్తర ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించింది. నవంబర్ 2, 2023 నాటి ఎక్స్‌ప్రెస్ నివేదికను బట్టి.. మేము ఈ సమాచారాన్ని ధృవీకరించాము. లెబనాన్ నుండి రాకెట్ల ప్రయోగం జరిగింది.

వీడియోకు సంబంధించిన నివేదిక ప్రకారం.. లెబనాన్ నుండి ప్రయోగించిన రాకెట్ ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యాత్ ష్మోనాలోని నివాస ప్రాంతాన్ని తాకినట్లు ధృవీకరించింది.

అందువల్ల టెల్ అవీవ్ అగ్నికి ఆహుతైందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో పాతది.. నవంబర్ 2023లో ఇజ్రాయెల్‌లోని కిర్యాత్ ష్మోనా మీదకు లెబనాన్ దాడి చేసింది.

Credit: Sibahathulla Sakib

Claim Review:టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story