FactCheck: 50 ప్లస్ 15= 73 అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారా?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడికలు కూడా తప్పుగా చేశారని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Feb 2024 3:45 PM GMT
NewsMeterFact Check, Rahul Gandhi

FactCheck: 50 ప్లస్ 15= 73 అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారా? 

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడికలు కూడా తప్పుగా చేశారని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ 50 ను 15తో కలిపితే 73 వస్తుందని చెప్పడం మనం చూడవచ్చు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. జనవరి 14న మణిపూర్ నుండి ప్రారంభమై మార్చి 20న ముంబయిలో ముగుస్తుంది. 14 రాష్ట్రాలలో దాదాపు 6,200 కిలోమీటర్లు ఆయన యాత్ర సాగుతుంది. ఈ వీడియో ఆయన యాత్రకు సంబంధించినదేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

“కామెడీ ఆగకూడదు...50 + 15 = 73 గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు రాహుల్ గాంధీ, (sic)” అని వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ వినియోగదారులు పోస్టులు పెట్టారు.

మరికొందరు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్‌లను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నిజ నిర్ధారణ:

రాహుల్ గాంధీ తప్పుడు లెక్కలు చేసినట్లుగా వైరల్ వీడియోను ఎడిట్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.

మేము Xలో కీవర్డ్ సెర్చ్ చేసాము. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా & డిజిటల్ కమ్యూనికేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ నితిన్ అగర్వాల్ పోస్ట్ చేసిన ఎడిట్ చేసిన, ఒరిజినల్ వీడియోలని చూశాము.

ఒరిజినల్ వెర్షన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “వెనుకబడిన కులాల జనాభా దాదాపు 50 నుండి 55 శాతం, దళితులు 15 శాతం, ఆదివాసీలు (ఆదివాసీలు) ఎనిమిది శాతం ఉన్నారని చెబుతున్నారు. 50, 15 మరియు 8 కలిపితే ఎంత? డెబ్బై మూడు.” అని అన్నారు.

వైరల్ క్లిప్‌ను బీజేపీ ఫాలోవర్లు ఎడిట్ చేశారని నితిన్ అగర్వాల్ ఆరోపించారు.

ఫిబ్రవరి 8న కాంగ్రెస్ పార్టీ అధికారిక X హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన రాహుల్ గాంధీకి సంబంధించిన 3:57 నిమిషాల వీడియోను కూడా మేము కనుగొన్నాము.

క్యాప్షన్లో “ఒక విలేకరి నన్ను అడిగాడు, 'రాహుల్ జీ, మీరు కుల గణన మరియు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి ఇది దేశాన్ని విభజించడం కాదా?" అని అడిగారు. నేను అతనిని 'మీడియాలో, ఎంత మంది వార్తాపత్రిక యజమానులు వెనుకబడిన వారు ఉన్నారు. ఆ సంస్థలు దళిత, గిరిజన తరగతులవా?’ అని ప్రశ్నించగానే అతడు సైలెంట్ అయిపోయాడు. దేశంలో దాదాపు 50 మంది ఓబీసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు ఉన్నారని చెప్పాను. ఈ మొత్తం 73 శాతం. అంటే మీరు 73 శాతం మందికి ఏమీ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు భారతదేశం ఎలా ఐక్యంగా ఉంటుంది?" అని చెప్పుకొచ్చారు.

వైరల్ క్లిప్ ఈ వీడియోలో దాదాపు 2:40 నిమిషాల వద్ద కనిపిస్తుంది. ఇందులో రాహుల్ గాంధీ 50 శాతం ఓబీసీలు, 15 శాతం దళితులు, ఎనిమిది శాతం గిరిజనులను 73 శాతమని చెప్పారు.

రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ:

రాహుల్ గాంధీని అతని రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ తప్పుగా చెప్పాడంటూ ఎడిట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు. అవి చాలానే వైరల్ అవుతూ ఉన్నాయి.

సెప్టెంబరు 2022లో, గోధుమ పిండి ధర గురించి మాట్లాడేటప్పుడు అతను 'కేజీ'కి బదులుగా 'లీటర్'ని కొలమానంగా ఉపయోగించిన వీడియో వైరల్ అయింది. వీడియో క్లిప్ ఎడిట్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది. గాంధీ 'లీటర్' అని చెప్పినప్పటికీ.. వెంటనే కొలమానాన్ని లీటర్ నుండి కేజీకి సరిచేశారు. వైరల్ వీడియోలో ఆయన సరిదిద్దబడిన భాగాన్ని తీసివేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అదేవిధంగా.. నవంబర్ 2022లో మరో వీడియో వైరల్ అయ్యింది. నిజంతో సంబంధం లేదని, తనకు అధికారం మాత్రమే కావాలని చెప్పడం చూపిస్తుంది. అయితే, ఆ వీడియోను కూడా ఎడిట్ చేసినట్లు న్యూస్‌మీటర్ గుర్తించింది. ఒరిజినల్ వీడియోలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తన గురించి కాకుండా బీజేపీని ఉద్దేశించి చేసిన ప్రకటన అని స్పష్టంగా తెలుస్తోంది.

కాబట్టి, రాహుల్ గాంధీ 50 ప్లస్ 15= 73 అని చెప్పినట్లుగా వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.

Credits: Md Mahfooz Alam

Claim Review:50 ప్లస్ 15= 73 అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story