నిజమెంత: రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారా?

రాజ్యాంగ రిజర్వేషన్‌లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 April 2024 12:31 PM

NewsMeterFactCheck, Amit Shah, BJP, Loksabhapolls

నిజమెంత: రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారా?

ఏడు దశల 2024 లోక్‌సభ ఎన్నికలలో రెండో దశ ఓటింగ్ తర్వాత, షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సిలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టిలు), వెనుకబడిన తరగతులు (ఓబీసీ).. ఇతరుల రాజ్యాంగ రిజర్వేషన్‌లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

"మీ ఓటు వేసే ముందు, రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కోరుతున్న హోం మంత్రి అమిత్‌షా ప్రకటనను వినండి, అందుకే రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు డిమాండ్ చేస్తున్నారు" అని వీడియోను (ఆర్కైవ్) షేర్ చేసిన X వినియోగదారు రాశారు.

అనేక ట్విట్టర్ హ్యాండిల్‌లు ఈ వైరల్ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నాయి. పలు సోషల్ మీడియా సైట్స్ లో కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఇతర ఆర్కైవ్ చేసిన పోస్ట్‌ల కోసం ఇక్కడ , ఇక్కడ క్లిక్ చేయండి .

నిజ నిర్ధారణ:

ఈ వీడియో ఎడిట్ చేశారని మేము గుర్తించాం.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది. అసలు వీడియోలో ‘తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింల రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను’ రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడారు.

ఈ వీడియోలో V6 న్యూస్ లోగో ఉన్నట్లు మేము గమనించాము. దీన్ని క్యూగా తీసుకొని, మేము V6 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కోసం వెతికాము. ఏప్రిల్ 23, 3023న ‘Union Minister Amit Shah Comments Muslim Reservations.’ (కేంద్ర మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్‌లపై వ్యాఖ్యలు) అనే శీర్షికతో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.

వైరల్ క్లిప్ వీడియోలో 2:38 నిమిషాల టైమ్‌స్టాంప్‌ వద్ద కనిపిస్తుంది. 'బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఈ అవకాశానికి అర్హులు" అని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.

NDTV ఏప్రిల్ 24, 2023న ‘తెలంగాణలో ముస్లిం కోటాను రద్దు చేస్తానని అమిత్ షా ప్రతిజ్ఞ’ అనే టైటిల్ తో వీడియోను ప్రచురించారు.

అమిత్ షా హైదరాబాద్ సమీపంలోని చేవెళ్లలో ర్యాలీలో ప్రసంగిస్తూ.. మత ఆధారిత రిజర్వేషన్లను 'రాజ్యాంగ విరుద్ధం' అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌లను అంతం చేస్తానని షా హామీ ఇచ్చారని ఏప్రిల్ 24, 2023న టైమ్స్ నౌ కూడా నివేదించింది. మత ప్రాతిపదికన కోటాలు రాజ్యాంగానికి విరుద్ధమని అమిత్ షా అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు ​​పంపారు. ఫేక్ వీడియోపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెష్ సెల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అమిత్‌ షాపై ఫేక్‌ వీడియో కేసులో సీఎం రేవంత్‌తో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అమిత్‌ షా మాట్లాడినట్టు ఫేక్‌ వీడియోను షేర్‌ చేశారంటూ సమన్లు ఇచ్చారు.

అమిత్ షా వైరల్ క్లిప్ పాతది, ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌ కోటాలను రద్దు చేయాలని అమిత్ షా ఎక్కడా చెప్పలేదు.

క్రెడిట్స్‌ : Md Mahfooz Alam

Claim Review:రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు
Claimed By:X and Facebook users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Facebook
Claim Fact Check:False
Next Story