ఒక ముస్లిం వ్యక్తి ఓ మహిళ ఇంటిపై కాషాయ జెండాను విసిరేయడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి తన డబ్బు తిరిగి ఇవ్వమని మహిళను బెదిరిస్తూ ఉన్నాడు. అతడిని మహిళ వేడుకుంటున్నట్లు.. బలవంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ముస్లిం వ్యక్తిని కొట్టడం ఆ వీడియోలో ఉంది.
"ముస్లిం వ్యక్తి రామ్ జీ జెండాను విసిరేశాడు" అని వీడియోను షేర్ చేసిన X వినియోగదారు పోస్టు పెట్టారు (Archive).
పలువురు ఫేస్‌బుక్ యూజర్లు కూడా ఈ వీడియోను ఇదే వాదనతో షేర్ చేశారు. (వీడియో కోసం ఇక్కడ క్లిక్, క్లిక్, క్లిక్ మరియు click చేయండి )
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ వీడియో ఓ షార్ట్ ఫిలిమ్ అని కనుగొంది.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. చాలా మంది X వినియోగదారులు ఈ వీడియోను స్క్రిప్ట్ తో సిద్ధం చేసిన వీడియో అని చెప్పుకొచ్చారని మేము కనుగొన్నాము. వీడియోలోని మూడు పాత్రలు హిందూ సమాజానికి చెందిన వ్యక్తులే వేశారు. వారిలో ఒకరు హేమ్‌రాజ్ ఠాకూర్ అని ఒక వినియోగదారు చెప్పారు. ముస్లిం క్యారెక్టర్ చేసిన హేమ్‌రాజ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశాడు.
దీన్ని క్యూగా తీసుకుని.. మేము ఫేస్‌బుక్‌లో హేమ్‌రాజ్ ఠాకూర్ కోసం వెతికాము. హిమాన్షు జాతవ్ అనే పేజీని చూశాము. పేజీకి సంబంధించిన URL వినియోగదారు పేరు ‘iamhemraj’ అని ఉందని మేము కనుగొన్నాం. ఆ ప్రొఫైల్ లో తనను తాను వీడియో క్రియేటర్ గా చెప్పుకొచ్చాడు.
మేము పేజీని పరిశీలించాం. అనేక వీడియోలను కనుగొన్నాము.. కానీ వైరల్ వీడియో కనిపించలేదు. దాదాపు అన్ని వీడియోలలో స్త్రీని ‘రక్షించే’ వ్యక్తిని మేము గమనించాము. వీడియోలు వినోదం కోసం మాత్రమేనని, పాత్రలు నిజమైనవి కావని పేర్కొంటూ వీడియోల ద్వారా వివరణ కూడా ఇచ్చారు.
తన వీడియోలను సీరియస్‌గా తీసుకోవద్దని పేర్కొంటూ మేము పేజీలో ఓ పోస్ట్‌ను కూడా కనుగొన్నాము. చాలా వీడియోలు స్క్రిప్టెడ్. అన్ని వీడియోలలో నటీనటులు వాళ్లే ఉన్నారు.
NewsMeter హేమ్‌రాజ్ ఠాకూర్‌ను సంప్రదించింది. అతను పేజీ పేరును మార్చడాన్ని, పేజీ నుండి వీడియోను తొలగించడాన్ని ధృవీకరించారు. "నేను ఈ వీడియో చేయడంలో లిమిట్స్ దాటాను.. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నాను" అని ఠాకూర్ అన్నారు. "నేను ట్రెండింగ్ అంశాలపై వీడియోలు చేస్తాను.. భవిష్యత్తులో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా.. జాగ్రత్తగా ఉంటాయని" అని ఆయన తెలిపారు.
అందువల్ల, స్క్రిప్టెడ్ వీడియోను మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.