నిజమెంత: హార్దిక్ పాండ్యా వెళుతుంటే రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేశారా?

ఐపీఎల్ 2024కి ముందు.. హార్దిక్ పాండ్యా, డిసెంబర్ 15, 2023న, రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ (MI) క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jan 2024 9:15 PM IST
NewsMeterFact Check, Rohit Sharma, fans, Hardik Pandya

నిజమెంత: హార్దిక్ పాండ్యా వెళుతుంటే రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేశారా? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024కి ముందు.. హార్దిక్ పాండ్యా, డిసెంబర్ 15, 2023న, రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ (MI) క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ట్రాన్స్ఫర్ ఇది అని కొందరు పేర్కొన్నారు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ కు వచ్చేయడమే కాకుండా రోహిత్ శర్మను కాదని పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. నాయకత్వ మార్పు రోహిత్ శర్మ అభిమానులను నిరాశపరిచింది. వారు ముంబై ఇండియన్స్ జెర్సీలు, క్యాప్‌లను తగులబెట్టడం ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా వెళుతున్నప్పుడు రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేసినట్లుగా అనిపించేలా వీడియో ఎడిట్ చేశార

డిసెంబర్ 24న హార్దిక్ పాండ్యా ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ‘ముంబై కా రాజా, రోహిత్ శర్మ’ (రోహిత్ శర్మ ముంబై రాజు)’ అంటూ కొందరు అరుస్తున్న ఆడియో అందులో ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు పాండ్యాను విమానాశ్రయంలో కొందరు ఆటపట్టిస్తూ ఉన్నారని సూచించాయి.

నిజ నిర్ధారణ:

రోహిత్ శర్మకు మద్దతుగా నినాదాలు చేసిన వ్యక్తుల ఆడియోను వీడియోలో ఎడిట్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.

మేము ఇన్‌స్టాగ్రామ్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము. నవంబర్ 29, 2023న ఇన్‌స్టంట్ బాలీవుడ్ అనే వెరిఫైడ్ ఖాతాలో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను పోస్ట్ చేసినట్లు కనుగొన్నాము. ఇందులో రోహిత్ శర్మకు మద్దతుగా ఎలాంటి నినాదాలు లేవు. ఇందులో హిందీ హిప్-హాప్ ఆడియో మాత్రం ఉంది. విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా కనిపించాడని వీడియో క్యాప్షన్ పేర్కొంది.

Goat Men Fashion అనే మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిసెంబర్ 2, 2023న వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో కూడా స్లోగన్స్ చేస్తున్నట్లు లేదు. కానీ డిజిటల్‌గా హిందీ పాటను జోడించారు.

చివరగా, మేము జనవరి 18, 2020న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియోను కనుగొన్నాం. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో రోహిత్ శర్మను అభిమానులు ప్రోత్సహించారు. వైరల్ వీడియోలోని ఆడియో ఈ వీడియోలోని నినాదాలతో సరిపోలిందని మేము గుర్తించాము.

అందువల్ల, విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా వెళుతున్నప్పుడు రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేసినట్లుగా అనిపించేలా వీడియో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.

Claim Review:విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా వెళుతున్నప్పుడు రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేసినట్లుగా అనిపించేలా వీడియో ఎడిట్ చేశారు.
Claimed By:Instagram user
Claim Reviewed By:Newsmeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Next Story