నిజమెంత: వైరల్ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కాదు.. అది డీప్‌ఫేక్

ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jan 2024 1:45 PM IST
Ukrainian President Zelensky, dancing man, Fact Check, deepfake

నిజమెంత: వైరల్ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కాదు.. అది డీప్‌ఫేక్

ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అతను ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

“Kicking off the new year like @ZelenskyyUa – full of unexpected twists and a lot of laughs! Wishing you a year so bright, even Zelensky would give it a standing ovation.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. జెలెన్ స్కీ న్యూ ఇయర్ ను ఇలా ఎంతో ఆనందంగా జరుపుకున్నారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వ్యక్తులు తెలిపారు.

“ Breaking Exclusive Footage of #Zelensky. Never before Seen footage Leaked of the Dance Zelensky does every time we send him another Billion Dollars.” అంటూ కూడా మరికొందరు వీడియోలను పోస్టు చేశారు. ఆయన ఇలా అద్భుతంగా డ్యాన్స్ చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని.. ఇదొక ఎక్స్ క్లూజివ్ వీడియో అని తెలిపారు.

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో డీప్‌ఫేక్ అని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ గుర్తించింది.

వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌ల ద్వారా.. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. Instagram హ్యాండిల్‌లో Gamgamtv అనే యూజర్‌నేమ్‌తో ఫిబ్రవరి 7, 2022 నాటి వీడియోను కనుగొన్నాము. వీడియోను జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు, వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని మేము నిశితంగా పరిశీలించాం. ఆ వీడియోలో ఉన్నది జెలెన్స్కీ కాదు, మరొక వ్యక్తి అని మేము గుర్తించాం.

మేము అదే వీడియోను మరింత సెర్చ్ చేయగా.. అక్టోబర్ 23, 2023 తేదీన టెలిగ్రాఫ్‌లో Dance.gifలో ప్రచురించినట్లు కనుగొన్నాము.

ఇది మాత్రమే కాదు, డీప్‌ఫేక్ అని పిలిచే వైరల్ వీడియోను కలిగి ఉన్న ట్వీట్ క్రింద X కమ్యూనిటీ సూచనలను కూడా ఇచ్చింది.

ఒరిజినల్ కు.. డీప్ ఫేక్ కు మధ్య ఉన్న తేడాలను కూడా మీరు గమనించవచ్చు.

మా సెర్చ్ ద్వారా, Volodymyr Zelensky కల్పిత డ్యాన్స్ వీడియోలకు సంబంధించిన అనేక సారూప్య వీడియోలను కూడా మేము కనుగొన్నాము. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ పేరు మీద పలు డీప్‌ఫేక్‌లకు కూడా మేము గుర్తించాం. గతంలో జెలెన్స్కీ వినోద పరిశ్రమలో హాస్య నటుడిగా పని చేశారు. అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించారు. మీరు జెలెన్స్కీ నటించిన ఈ పార్టీ మ్యూజిక్ వీడియోని చూడవచ్చు.

NewsMeter ఇంతకుముందు కూడా ఇలాంటి కథనాలపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. కాబట్టి, జెలెన్స్కీకి సంబంధించిన వైరల్ డ్యాన్స్ వీడియో ఒరిజినల్ కాదని.. డీప్ ఫేక్ వీడియో అని మేము గుర్తించాం.

Credits: Sunanda Naik

Claim Review:వైరల్ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉక్రేనియన్ ప్రెజ్ జెలెన్స్కీనా
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story