నిజమెంత: G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదా?

జీ7 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2024 8:15 AM GMT
NewsMeterFactCheck, G7 Summit, PM Modi, Joe Biden

G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదా? 

ఇటలీలో మూడు రోజులపాటు జీ7 దేశాల సదస్సు సాగింది. జీ7 కూటమిలో భారత్ సభ్యదేశం కానప్పటికీ.. బ్రెజిల్, అర్జెంటీనా, యూఏఈ, టర్కీ తదితర దేశాలతోపాటు ఇండియాకు కూడా ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఆహ్వానం పంపించారు. దీంతో ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. జూన్ 13 నుండి 15 వరకూ.. ఇటలీలోని అపులియాలోని బోర్గో ఎగ్నాజియా (ఫాసనో)లో జీ7 సమ్మిట్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో, సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేశారు. “మోదీ జీ జో బిడెన్‌తో కరచాలనం చేయలేదు. భారతదేశ ఎన్నికలలో జోక్యం చేసుకుంటే ఏమి జరుగుతుందో మోదీ అమెరికాకు చూపించారు." అంటూ హిందీలో పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

ప్రధాని మోదీతో కలిసి కనిపించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కానందున ఈ వాదన అబద్ధమని NewsMeter కనుగొంది. ఒక సహాయక సిబ్బంది ప్రధానమంత్రిని తదుపరి సమావేశం గురించి తెలియజేస్తున్నట్లు వీడియో చూపించింది.

మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. జూన్ 15న ఫస్ట్‌పోస్ట్ మీడియా సంస్థ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను కూడా కనుగొన్నాము,‘Hello From Team Meloni: Selfie of PM Modi & Giorgia Meloni Goes Viral | PM Modi at G7 Summit 2024.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

వీడియో ప్రారంభంలో వైరల్ క్లిప్ కనిపించింది. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి స్వాగతం పలికిన ఒక సపోర్టు స్టాఫ్ మెంబర్ మోదీని వేదిక వైపుకు సూచిస్తున్నట్లు స్పష్టంగా వీడియోలో ఉంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ కు సంబంధించింది కాదు.

మరింత అవగాహన కోసం, మేము వీడియో స్లో మోషన్ వెర్షన్‌ను కూడా మీకోసం ఉంచాం.

వీడియోలోని G7 సిబ్బందిని, జో బిడెన్‌ కి సంబంధించిన ఫోటో ఇక్కడ ఉంది. ప్రధాని మోదీ పక్కన నడిచిన వ్యక్తికి ముందు భాగంలో బట్టతల ఉండగా, బిడెన్‌కు జుట్టు ఉందని చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

కాబట్టి, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కరచాలనం ఇస్తున్నా కూడా ప్రధాని మోదీ పట్టించుకోలేదంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credits: Md Mahfooz Alam

Claim Review:G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story