Fact Check: ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ భార్య తన ముఖాన్ని అందరికీ చూపించారా?

పాట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. వివాహం చాలా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, అనేక మంది విద్యావేత్తలు, రాజకీయ నాయకులు రిసెప్షన్ కు హాజరయ్యారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 10 Jun 2025 8:00 AM

NewsMeterFactCheck, Khan Sir, Patna, Wedding

Fact Check: ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ భార్య తన ముఖాన్ని అందరికీ చూపించారా? 

పాట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. వివాహం చాలా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, అనేక మంది విద్యావేత్తలు, రాజకీయ నాయకులు రిసెప్షన్ కు హాజరయ్యారు. ఫోటోలు, వీడియోలలో ఖాన్ సర్ భార్య ముఖం సాంప్రదాయ ముసుగుతో కప్పబడి ఉంచారు.

చాలా మంది ముసుగుతో ఆమె ఉండడాన్ని ప్రశంసించారు. దీనిని సాంస్కృతిక సంప్రదాయానికి గుర్తు అని అన్నారు. అయితే, మరికొందరు ఖాన్ సర్ వంటి ప్రగతిశీల వ్యక్తి ఇలాంటి సంప్రదాయాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు.

ఈ సందర్భంలో, ఖాన్ సర్ భార్య తన ముఖాన్ని బహిర్గతం చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖాన్ సార్ భార్య తన ముఖాన్ని చూపించారనే వాదనతో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

ఈ వీడియోను AI ద్వారా రూపొందించారని, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.

వీడియోలో తేడాలు:

వీడియోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, మేము అనేక అసమానతలను గమనించాము.

ఉదాహరణకు ముక్కు పుడక.. వధువు తన ముఖాన్ని చూపించినప్పుడు అదృశ్యమవుతుంది. అదనంగా, తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాజకీయ నాయకుడితో కరచాలనం చేస్తున్నప్పుడు ఖాన్ ముఖం, చేతులు అసహజంగా ఉన్నాయి. ఈ తేడాలు వీడియో AI ద్వారా సృష్టించి ఉంటారని సూచిస్తున్నాయి.

వీడియోలో వాటర్‌మార్క్

వీడియోలో న్యూజ్ యాత్ర వాటర్‌మార్క్‌ను కూడా మేము గమనించాము. దర్యాప్తులో, జూన్ 6న న్యూజ్ యాత్ర ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. శీర్షికలో, వీడియో AIని ఉపయోగించి సృష్టించారని ఖాతా స్పష్టంగా పేర్కొంది.

AI డిటెక్షన్ టూల్స్ ఫలితాలు:

మేము హైవ్ మోడరేషన్ AI టూల్ ను ఉపయోగించి వీడియోను విశ్లేషించాము, ఈ కంటెంట్ AI-జనరేట్ చేసిన లేదా డీప్‌ఫేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిర్ధారించింది. 99.2 శాతం ఏఐ కంటెంట్ అంటూ తేలింది.

ఖాన్ సర్ భార్య ఎవరు?

జనసత్తా, నవభారత్ టైమ్స్ ప్రచురించిన నివేదికల ప్రకారం, ఖాన్ సర్ భార్య పేరు ఐమాన్ సిద్ధిఖీ. ఆమెను జీనత్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందినది, ఢిల్లీలో ఉన్నత చదువులు అభ్యసించడానికి ముందు ఆమె తన ప్రారంభ విద్యను అక్కడే పూర్తి చేసింది. జూన్ 2న పాట్నాలో జరిగిన రిసెప్షన్‌లో ఆమెను అధికారికంగా ప్రజలకు పరిచయం చేశారు. ఎర్రటి పెళ్లి లెహంగాలో కనిపించింది.

Claim Review:Fact Check: ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ భార్య తన ముఖాన్ని అందరికీ చూపించారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story