చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు సముద్రంలో భారీ తుఫాను ఎలా ఉంటుందో తెలియజేస్తూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. భారీ తుఫాను గుజరాత్- పాకిస్తాన్ తీరాలను సమీపిస్తోందని. ఇది బిపర్జోయ్ తుఫాను అని పేర్కొంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో భారీ తుఫాను కార్గో షిప్‌ను చుట్టుముట్టింది.
బిపార్జోయ్ తుఫాను భారత దేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.
వైరల్ వీడియో ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్‌లో ఇసుక తుఫానుకు సంబంధించినది. బిపర్జోయ్ కు సంబంధించినది కాదమొ NewsMeter కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూన్ 3, 2023 నాటి YouTube షార్ట్ వీడియోలను Marineinsight అనే YouTube ఛానెల్ లో మేము కనుగొన్నాము. వీడియో శీర్షిక ఈజిప్ట్‌లోని సూయెజ్ కెనాల్ వద్ద ఇసుక తుఫానుగా విజువల్స్ అని సమాచారం ఇచ్చింది.
ఇదే వీడియోను బీబీసీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దీని నుండి క్యూ తీసుకొని కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అందుకు సంబంధించిన పలు కథనాలను, వీడియోలను మేము కనుగొన్నాం. 'ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్ లో భారీ ఇసుక తుఫాను' అని పలు కథనాలను మేము చూశాం. ఇసుక తుఫానుకు సంబంధించిన అదే వీడియో కనిపించింది. జూన్ 2 2023న అప్లోడ్ చేసిన వీడియోలో వేరొక కోణంలో వీడియోను చిత్రాకరించారు.
జూన్ 1, 2023న ఈజిప్టులోని సూయజ్ కెనాల్ వద్ద ఇసుక తుఫాను సంభవించినట్లు టైమ్స్ నౌ కూడా అదే విజువల్స్ నివేదించింది.
పలు యూట్యూబ్ వీడియోలలో కూడా ఇదే విషయం గురించి తెలియజేసారు.
ఈజిప్ట్ లో చోటు చేసుకున్న ఘటనలను భారత్ కు ఆపాదించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik