FactCheck : తమకు ఓటేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తామని జగన్ అన్నట్టుగా ఎడిట్ వీడియో షేర్ చేస్తున్నారు

Edited Video Shared As YS Jagan Offering One KG Gold To Vote In Elections. తమ పార్టీకి ఎన్నికలలో ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత,

By Nellutla Kavitha  Published on  3 Jan 2023 6:25 PM IST
FactCheck : తమకు ఓటేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తామని జగన్ అన్నట్టుగా ఎడిట్ వీడియో షేర్ చేస్తున్నారు

తమ పార్టీకి ఎన్నికలలో ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో ప్రచారం చేస్తున్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేజీ బంగారం వస్తేనే ఓటు వేయండి లేకపోతే వద్దు అనే ఇదే వీడియో ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు మరొక నెటిజన్. వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక ఇదే వీడియోని జీవన్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేశారు.

https://www.youtube.com/shorts/ngHuHPz51V4

నిజనిర్ధారణ

సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత ?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీవర్డ్ సెర్చ్ తో పాటుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేసినట్టుగా అర్థమయింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా కే. కోటపాడులో సెప్టెంబర్ 3, 2018 రోజున ప్రసంగించినట్టుగా వైయస్సార్సీపి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. 1:01:04 నిడివి ఉన్న ఈ వీడియోలో 40:30 నిమిషాల దగ్గర వైరల్ వీడియో లో సర్క్యులేట్ అవుతున్న బంగారం ఇస్తాను అన్న దృశ్యం కనిపిస్తుంది. అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తి - చంద్రబాబుని క్షమిస్తే, ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వచ్చి గతంలో తాను చేసిన ఎన్నికల వాగ్దానాలు 99 శాతం పూర్తిచేశామని, ఈసారి ఓటేస్తే ప్రతి ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


ఇదే ప్రసంగాన్ని ఎడిట్ చేసి వైరల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక జూన్ 21, 2018 న పెద్దాపురంలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే ఎన్నికల్లో కిలో బంగారం ఇస్తానని వాగ్దానం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలని 4:47:50 నుంచి గమనించవచ్చు.


Aug 1, 2018 రోజు జరిగిన బహిరంగ సభలో కూడా వైఎస్ జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు.


July 1, 2018 ఈ రోజు వైయస్సార్ సిపి తన వెబ్సైట్లో ఉంచిన ప్రెస్ నోట్ లో కూడా, చంద్రబాబు నాయుడు తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానని వాగ్దానం చేస్తారంటూ జగన్ ప్రసంగించినట్టుగా పేర్కొన్నారు.

https://www.ysrcongress.com/amp/others/chandrababu-leader-brokers-34664?params=LzIwMTgvMDcvMDEvMzQ2NjQuanNvbg==

సో, ఎడిట్ చేసిన వీడియోలను, తమ పార్టీకి ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు..తమకు ఓటేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తామని జగన్ అన్నట్టుగా ఎడిట్ వీడియో షేర్ చేస్తున్నారు

Next Story