2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సర్క్యులర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా.. ప్రవర్తనా నియమావళి మార్చి 12 నుండి అమలులోకి వస్తుందని.. 'నామినేషన్ల' తేదీ మార్చి 28, పోలింగ్ ఏప్రిల్ 19 న ఉంటుంది. కౌంటింగ్ తేదీ, ఫలితాలను మే 22న విడుదల చేస్తారని అందులో ఉంది. ఇక మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
పలువురు X వినియోగదారులు అవే ఎన్నికల తేదీలు అంటూ సర్క్యులర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఎంతో మంది ఫేస్ బుక్ వినియోగదారులు కూడా ఈ వైరల్ పోస్టును నమ్మేసి.. తమ వాల్ లో అప్లోడ్ చేశారు. ఇక వాట్సాప్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఆ సర్క్యులర్ నకిలీదని NewsMeter కనుగొంది.
మేము ECI అధికారిక X హ్యాండిల్‌ని తనిఖీ చేసాము. వైరల్ సందేశం నకిలీదని పేర్కొంటూ ఒక వివరణను కనుగొన్నాము. LokSabhaElections2024 షెడ్యూల్‌కు సంబంధించి వాట్సాప్‌లో నకిలీ సందేశం షేర్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఎలెక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటివరకు ఎటువంటి తేదీలు ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్‌ను కమిషన్ మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుందని వివరణను మేము చూశాం.
ఎలెక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా పలు సోషల్ మీడియా ఖాతాలలో ఈ వైరల్ పోస్టును ఖండిస్తూ వివరణ ఇచ్చింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 21 నివేదిక ప్రకారం.. NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) నేతృత్వంలోని 17వ లోక్‌సభ సమావేశాల అధికారిక పదవీకాలం జూన్ 16న ముగియనుంది. భారతదేశంలోని 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇండియా టుడే ఫిబ్రవరి 23 నివేదిక ప్రకారం.. ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధత పూర్తయిన తర్వాత తేదీలను ప్రకటిస్తారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేక రాష్ట్రాలను సందర్శిస్తోంది.. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంది.
కాబట్టి, వైరల్ సర్క్యులర్ నకిలీదని మేము నిర్ధారించాము.
Credit : Md Mahfooz Alam