ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాప్పే రోబోతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక X వినియోగదారుడు ఈ వీడియోను “How real is this? Mbappe Training with a robot.” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
చాలా మంది X, Facebook వినియోగదారులు ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పంచుకున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్ మీటర్ బృందం ఈ వైరల్ వీడియోను ఎడిట్ చేశారని గుర్తించింది.
వీడియోను నిశితంగా గమనించగా.. ఈ వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారని మేము గుర్తించాం. మనిషి స్థానంలో రోబోను ఉంచారు. అలా వీడియో డిజిటల్‌గా మార్చారని మేము కనుగొన్నాము. 0.01 సెకన్ల వద్ద, ఎంబాప్పే ఫుట్‌బాల్‌ను మరొక ఆటగాడికి పాస్ చేయడం మనం గమనించవచ్చు. అయితే, 0.02 సెకన్ల వీడియోలో రోబోట్ గోల్ చేస్తున్నట్టు చూపిస్తుంది.
మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. ధృవీకరించిన YouTube ఛానెల్ OussiFooty ద్వారా అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోను జూన్ 5, 2022న మేము కనుగొన్నాము, “Mbappé's reaction says it all.” అని ఆ వీడియో ఉంది. ఇందులో ఎంబాప్పే నుండి పాస్ అందుకున్న తర్వాత మరొక ఆటగాడు గోల్ చేయడం చూడొచ్చు.
ఒరిజినల్ వీడియోకు.. ఎడిట్ చేసిన వీడియోకు మధ్య తేడాను గమనించవచ్చు.
రెండు వీడియోలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
మనిషి స్థానంలో రోబోట్‌ను డిజిటల్‌గా ఉంచి వైరల్ వీడియోను రూపొందించారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Ali