FactCheck : నాటు నాటు పాటకు తోలుబొమ్మ స్టెప్పులు అంటూ వీడియో వైరల్.. నిజంగానే చేయించారా..?

Doctored video shows a puppet dancing to ‘Naatu Naatu’. SS రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం 'RRR' లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 March 2023 12:48 PM GMT
FactCheck : నాటు నాటు పాటకు తోలుబొమ్మ స్టెప్పులు అంటూ వీడియో వైరల్.. నిజంగానే చేయించారా..?

SS రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం 'RRR' లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఈ పాటకు పెద్ద ఎత్తున చాలా మంది మరోసారి డ్యాన్స్ లు చేస్తూ వస్తున్నారు. నాటు నాటు ట్యూన్‌కు తోలుబొమ్మ నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు.

“Ok. One last tweet, I promise, about #NaatuNaatu But couldn’t resist this one. Real evidence of it being a global phenomenon since it now has the whole world on its ‘strings’.” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

నిజ నిర్ధారణ :

న్యూస్ మీటర్ బృందం వైరల్ క్లిప్ ను ఎడిట్ చేశారని కనుగొంది. అసలు వీడియో ఆరేళ్ల పాతది, ప్రముఖ స్పానిష్ సాంగ్ “డెస్పాసిటో”కి తోలుబొమ్మతో డ్యాన్స్ చేయించారు. అప్పటి వీడియోలోని సాంగ్ ను తీసి వేసి.. నాటు నాటును ఎడిట్ చేసి ఉంచారు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తున్నారు.

వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు.. మేము 21 ఆగస్టు 2017న YouTubeలో ప్రచురించిన అసలైన వీడియోను కనుగొన్నాము. దాని పేరు “డెస్పాసిటో డ్యాన్సింగ్ పప్పెట్!!” అని ఉంది.


దీనిని క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. BuzzFeed, Vultureలో ప్రచురించిన 2017 సంవత్సరానికి చెందిన కథనాలను కనుగొన్నాము. రెండు కథనాలు వైరల్ వీడియోను కలిగి ఉన్నాయి. తోలుబొమ్మకు సంబంధించిన అసలు డ్యాన్స్ "డెస్పాసిటో" ట్యూన్‌ కు చేసిందని గుర్తించాం.

ఒరిజినల్ వీడియో కనీసం ఆరేళ్ల నాటిది. "నాటు నాటు" కాకుండా "డెస్పాసిటో"కి ఈ తోలుబొమ్మ డ్యాన్స్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నేపథ్య సంగీతంగా "నాటు నాటు" ఉన్న వైరల్ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.

- Credits : Md Mahfooz Alam



Claim Review:నాటు నాటు పాటకు తోలుబొమ్మ స్టెప్పులు అంటూ వీడియో వైరల్.. నిజంగానే చేయించారా..?
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story