బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బాడీ సూట్ ధరించి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో షారుఖ్ ఖాన్ బాడీ సూట్ వేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది. షారుఖ్ ఖాన్ తాజా చిత్రం 'పఠాన్' కోసం నకిలీ సిక్స్ ప్యాక్ బాడీ సూట్ ధరించాడని నెటిజన్లు చెబుతూ ఉన్నారు.
'పఠాన్' సినిమాకు సంబంధించిన "బేషరమ్" పాట నుండి వివాదాలు మొదలయ్యాయి. కలెక్షన్స్ ను కూడా కొందరు విమర్శిస్తూ వచ్చారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేశారని కనుగొంది.
వైరల్ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫోటో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాకు సంబంధించినదని.. థోర్ పాత్రకు సంబంధించి నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ కు బాడీసూట్ వేస్తున్నట్లు గుర్తించాం. చిత్రాన్ని విశ్లేషించినప్పుడు, ఈ ఫోటోలో షారుఖ్ ఖాన్ ముఖం మార్ఫ్ చేశారని మేము కనుగొన్నాము.
Cine Series వెబ్ సైట్ లో “Thor Lebowski particularly relaxed behind the scenes.” అంటూ ఫోటోకు టైటిల్ ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ ఇమేజ్ కు సంబంధించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. వీడియోలో, క్రిస్ హెమ్స్‌వర్త్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా షూటింగ్ కోసం బాడీ సూట్ ధరించాడని తెలిపారు. “‘అవెంజర్స్’ సినిమా షూటింగ్ కోసం, క్రిస్ హెమ్స్‌వర్త్ 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న ప్రత్యేక సూట్ ధరించాడు! మేకప్ కోసం ప్రతిరోజూ చాలా గంటలు సమయం పట్టింది. ” అని తెలిపారు.
అసలు చిత్రంలో, క్రిస్ హెమ్స్‌వర్త్ లావుగా కనిపించేలా చేయడానికి బాడీ సూట్ ఉపయోగించారని మేము గమనించాము. వైరల్ ఇమేజ్‌లో, బాడీసూట్ కూడా టోన్డ్ బాడీని చూపించడానికి మార్ఫ్ చేశారు
దీన్ని బట్టి వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న దావాలో ఎటువంటి నిజం లేదు.
Credits: Sunanda Naik