నెరవేర్చలేని వాగ్దానాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోందని ఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పిన వీడియో వైరల్ అవుతూ ఉంది. AAP వాగ్దానాలు నెరవేర్చలేనివని.. ఆ విషయాన్ని తాను అంగీకరించానని భగవంత్ మాన్ పేర్కొన్న 5 సెకన్ల వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
'ఏది చేస్తామో అది చెప్తాము.. ఏది చేయాలేమో.. అది కూడా చెప్పేస్తూ ఉంటాం' అని భగవంత్ మాన్ చెప్పిన వీడియో వైరల్ అవుతూ ఉంది.
పోస్ట్‌ను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
హర్యానా బీజేపీ మాజీ ఐటీ సెల్ చీఫ్ అరుణ్ యాదవ్ ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను ట్విట్టర్‌లో విమర్శించారు.
పలువురు ఇదే వీడియోను ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక YouTube ఛానెల్‌లో 7 సెప్టెంబర్ 2022న ప్రచురించిన వీడియోకు సంబంధించిన పొడవైన వీడియోను మేము కనుగొన్నాము.
Youths of Haryana in a Townhall with Arvind Kejriwal and Bhagwant Mann అంటూ టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
వీడియోలో 17.45 నిడివి తర్వాత భగవంత్ మాన్ స్టార్టప్ ఐడియాలతో ముందుకు వచ్చిన యువతను అభినందించడం చూడవచ్చు. తప్పుడు వాగ్దానాలు చేసే వారు మీకు సహాయాన్ని అందించరు అని కూడా ఆయన అన్నారు.
18.19 నిమిషాల వద్ద మాట్లాడుతూ.. "కానీ మేము తప్పుడు వాగ్దానాలు చేసే పార్టీ కాదు, మేము చేసేది, మేము చెప్పేది, చేయలేనివి అన్నీ మీకు చెప్తాము. వాగ్దానం చేసినవాటిని తప్పకుండా ఆచరణలో పెడతాం" అని అన్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా ఆప్ ఆచరణకు వీలు కాని హామీలను ఇస్తుందని చెప్పలేదు. ఆ రోజు జరిగిన ఈవెంట్ కు సంబంధించిన వీడియో మీరు కూడా చూడవచ్చు.
ఆచరణకు వీలు కాని హామీలను ఆప్ కూడా ఇస్తోందని పంజాబ్ సీఎం అనలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కువ నిడివి ఉన్న వీడియోను ట్రిమ్ చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వాడుతూ ఉన్నారు.