తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు బాక్సర్ నిఖత్ జరీన్ చెక్కు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. సీఎం రూ.కోటి పారితోషికం ఇచ్చారని నెటిజన్లు పేర్కొంటున్నారు. 19 మే 2022న జరిగిన 2022 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత జరీన్‌కి 50 లక్షలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చారంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి.
'బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రూ. 50 లక్షలు అందించారు' అనే క్యాప్షన్‌తో ఫోటో షేర్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
ఇటీవల ఆమె అద్భుతమైన విజయం సాధించాక సీఎం కేసీఆర్ 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారా అనే విషయమై న్యూస్ మీటర్ బృందం కథనాల కోసం వెతకగా.. ఎటువంటి రిజల్ట్స్ మాకు లభించలేదు.
జరీన్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ సీఎం కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో నగదు పురస్కారం గురించి ప్రస్తావించలేదు. పత్రికా ప్రకటనను నివేదించిన మీడియా సంస్థలు నగదు బహుమతిని పేర్కొనలేదు.
వైరల్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదు. 2014 సంవత్సరం లోనిది. 2014లో 10 మంది క్రీడాకారులను సీఎం సత్కరించి వారికి 6.11 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన వారిని సత్కరించారు.
డెక్కన్ క్రానికల్ 16 ఆగస్టు 2014 నాటి నివేదికలో వైరల్ ఫోటో ఉంది. సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, పారుపల్లి కశ్యప్, పీవీ సింధు, గురుసాయిదత్, జ్వాలా గుత్తా, నిఖత్ జరీన్ వంటి పలువురు క్రీడాకారులను సీఎం సత్కరించినట్లు సమాచారం.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా 16 ఆగస్టు 2014న ఈ ఫోటోను పంచుకున్నారు.
2014 నాటి ఫోటోను 2022 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 50 లక్షలు అందించారంటూ ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.