ద్రావిడ మున్నేట్ర కజగం (డిఎంకె) పార్లమెంటు సభ్యుడు ఎస్‌ఎస్ పళనిమాణికంకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లావణ్యకు నివాళులర్పించనందుకు ఉదయనిధి స్టాలిన్‌ను పళనిమాణిక్యం విమర్శించారని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. డీఎంకే వాలంటీర్ కుమార్తె లావణ్య మతమార్పిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని, అదే విధంగా ఉదయనిధి స్వయంగా వచ్చి నివాళులర్పించకపోవడం చాలా నిరాశకు గురిచేస్తోందని ఆయన చెప్పారనే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
నిజ నిర్ధారణ :
ఈ ఘటనపై NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. క్లెయిమ్‌కు సంబంధించిన ఎలాంటి వార్తా నివేదికను మేము కనుగొనలేదు. వైరల్ న్యూస్‌కార్డ్ గురించి 'తంతి టీవీ' మీడియా సంస్థ చేసిన ప్రస్తావన మేము గమనించాము. ఈ మీడియా ద్వారా ప్రసారం చేయబడిన అటువంటి వార్తల కోసం వెతికాము. మేము జనవరి 24, 2022న Thanthi TV ద్వారా చేసిన ట్వీట్‌ని కనుగొన్నాము. ఆ ట్వీట్‌లో, వైరల్ న్యూస్ కార్డ్ నకిలీ అని మీడియా సంస్థ స్పష్టంగా పేర్కొంది.
తదుపరి దర్యాప్తులో, జనవరి 24, 2022న S.S పళనిమాణికం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో చేసిన ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము. వైరల్ న్యూస్ కార్డ్‌ను పళనిమాణికం ట్వీట్ చేస్తూ.. 'ఇదొక ఫేక్ న్యూస్ అని.. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము' అని తెలిపారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.