కాథలిక్ పాస్టర్ ఒక సంవత్సరం తర్వాత కోమా నుండి మేల్కొన్న తర్వాత వెంటనే ఇస్లాం మతంలోకి మారాడని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. వారు తమ వాదనను ధృవీకరించడానికి ఒక హిందీ వార్తాపత్రిక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి వెబ్‌లో శోధించింది. 'Utusan Online' అనే వార్తల వెబ్‌సైట్ నుండి ఒక ట్వీట్‌ను కనుగొంది. కోమా నుండి మేల్కొన్న తర్వాత ఒక ప్రీస్ట్ ఇస్లాంను స్వీకరించారంటూ వచ్చిన నివేదికలు బూటకమని ధృవీకరించింది.
'ఉటుసాన్ ఆన్‌లైన్' ట్వీట్‌లో.. 17 నెలల పాటు కోమాలో ఉన్న క్యాథలిక్ మతగురువు ఇస్లాం మతంలోకి మారినట్లు 'వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్' వెబ్‌సైట్ అబద్ధమని పేర్కొంది.
వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్‌ను కూడా పరిశీలించాము. వరల్డ్ న్యూస్ డైలీ ప్రకారం.. ఇండోనేషియాలో నివసిస్తున్న 87 ఏళ్ల స్పానిష్ ప్రీస్ట్ "17 నెలల తర్వాత కోమా నుండి మేల్కొన్నాడు".. "అల్లా తనతో మాట్లాడాడని తనకు స్వర్గం ఎలా ఉంటుందో చూపించాడని ఆ వ్యక్తి చెప్పి తర్వాత ఇస్లాం మతంలోకి మారాడు." అని ఉంది.
అతడు కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడ్డాడు, చర్చ్ పైకప్పు నుండి పడిపోయినా వెన్నెముకకు ఎటువంటి గాయం అవ్వకుండా లేచి నిలబడ్డాడని అందులో ఉంది.
వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ "టెల్ అవీవ్‌లో ఉన్న ఒక అమెరికన్ జియోనిస్ట్ వార్తాపత్రిక, బైబిల్ పురాతత్వ శాస్త్ర వార్తలు మరియు ఇతర ప్రపంచ రహస్యాలను కవర్ చేయడానికి అంకితం చేయబడింది." అని ఉండడమే కాకుండా.. ఆ సైట్ దీన్ని వ్యంగ్యం అని పేర్కొంటూ కథనాన్ని పోస్ట్ చేసింది. "worldnewsdailyreport.comలో ఉన్న అన్ని వార్తా కథనాలు కల్పితం.. బహుశా నకిలీ వార్తలు" అని సైట్ అంగీకరించింది.
విక్టర్ ఫెంటర్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన కాథలిక్ ప్రీస్ట్, 13వ శతాబ్దపు ఇస్లామిక్ పండితుడు, కవి, సూఫీ ఆధ్యాత్మికవేత్త మెవ్లానా జలాలుద్దీన్ అల్-రూమీచే ప్రభావితమైన తర్వాత 2006లో ఇస్లాంలోకి మారాడు. ఫెంటర్ ఇస్లాంలోకి మారడానికి ముందు US విశ్వవిద్యాలయాలలో మతానికి సంబంధించిన పాఠాలను బోధిస్తూ ఉండేవాడు. ఫెంటర్ రూమీ ఇస్లాం గురించి తెలుసుకున్న తర్వాత ఆ మతాన్ని స్వీకరించాడు. అతను తన పేరును ఇస్మాయిల్‌గా మార్చుకున్నాడు. టర్కీలోని కొన్యాకు మకాం మార్చాడు. పోస్ట్‌లో భాగస్వామ్యం చేయబడిన కథనం కల్పితం.. వ్యంగ్యానికి మారుపేరైన వెబ్‌సైట్ 'వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్' నుండి తీసుకోబడింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.