ఏప్రిల్ 19న 2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీపై రణ్‌వీర్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కారణంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఎక్కువవుతూ ఉన్నట్లు రణ్‌వీర్ సింగ్ చెప్పినట్లుగా అందులో ఉంది. భారతదేశంలో న్యాయానికి ఎటువంటి చోటు లేదని.. అభివృద్ధి, న్యాయం గురించి మాట్లాడాల్సిందేనని రణ్‌వీర్ సింగ్ చెప్పినట్లు ఉంది. అందుకే విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలదని, ఆ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఆ వీడియో ముగుస్తుంది.
“న్యాయం జరుగుతుంది. వోట్ ఫర్ కాంగ్రెస్ వోట్ ఫర్ న్యాయ్” అని వీడియోను షేర్ చేసిన ఒక X వినియోగదారు రాశారు. (ఆర్కైవ్)
చాలా మంది X వినియోగదారులు కూడా అదే వాదనతో వీడియోను షేర్ చేసారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వీడియోను ఎడిట్ చేశారని గుర్తించింది. వైరల్ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని కనుగొంది. అసలు వీడియోలో, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి తీసుకున్న చర్యలపై రణ్ వీర్ సింగ్ ప్రధాని మోదీని ప్రశంసించారు.
రణ్ వీర్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. దీన్ని క్యూగా తీసుకొని, మేము ANI.. YouTube ఛానెల్‌లో వీడియో కోసం వెతికాము. ఏప్రిల్ 14, 2024న ప్రచురించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కనుగొన్నాము. రణ్‌వీర్ సింగ్, నటి కృతి సనన్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు.. ప్రధానమంత్రి ‘వికాస్ భీ, విరాసత్ భీ’ విజన్‌ని ప్రశంసించారని ఆ వీడియోలో ఉంది.
2:18 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద, వైరల్ క్లిప్ వీడియోలో కనిపిస్తుంది.
రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. “మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, చరిత్ర, వారసత్వాన్ని కాపాడుకోవడమే మోదీ ఉద్దేశం. భారతదేశం చాలా వేగంగా ఆధునికత వైపు పయనిస్తోంది, అయితే మన మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని మనం మరచిపోకూడదు. అందుకే అభివృద్ధితో పాటు వారసత్వానికి కూడా ప్రాముఖ్యత ఉండాలి…” అని రణ్ వీర్ సింగ్ చెప్పుకొచ్చారు. కాశీ లో జరిగిన అభివృద్ధిని కూడా రణ్ వీర్ సింగ్ కొనియాడారు.
ANI ప్రకారం.. ఏప్రిల్ 14 న, రణవీర్ సింగ్, కృతి సనన్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆలయ సందర్శన తర్వాత వారణాసి ఘాట్ వెంబడి బోటు షికారు చేశారు. NDTV, ET Now, News9 లైవ్ ద్వారా PM మోదీని రణ్ వీర్ సింగ్ ప్రశంసించిన అసలు క్లిప్‌ను కూడా మేము కనుగొన్నాము.
ప్రధాని మోదీని విమర్శిస్తూ బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రణ్ వీర్ వైరల్ వీడియోను ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.
Credits: Md Mahfooz Alam