Fact Check : అమూల్ మిల్క్ సంస్థ 1.38 లక్షల ముస్లిం ఉద్యోగులను విధుల నుండి తొలగించిందా..?
Did Amul Milk Fire 1.38 lakh Muslim Employees. అమూల్ మిల్క్ సంస్థ ఓనర్ 1.38 లక్షల ముస్లిం ఉద్యోగులను విధుల నుండి తొలగించారంటూ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2021 2:42 AM GMTఅమూల్ మిల్క్ సంస్థ ఓనర్ 1.38 లక్షల ముస్లిం ఉద్యోగులను విధుల నుండి తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"अमूल दूध के मालिक आनंद सेठ ने अपने फैक्ट्री से 1 लाख 38 हजार मुस्लिम लोगो को निकाला, कहा देश मे थूक वाला जिहाद देख कर हम लोगो को गंदा दूध, दही, धी नहीं पिला खिला सकते, क्युकी अमूल दूध पिता है इंडिया* *अमूल दूध को दिल से आभार ऐसा कदम उठाने के लिए," అని హిందీలో మెసేజీ వైరల్ అవుతోంది.
"అమూల్ పాలు యజమాని ఆనంద్ సేథ్ తన సంస్థ నుండి 1 లక్ష 38 వేల మంది ముస్లింలను తొలగించారు. దేశంలో జిహాద్ అంటూ ఉమ్మివేయడాన్ని చూసిన తరువాత వారు మురికి పాలు, పెరుగు, పాలను ప్రజలకు ఇవ్వలేరు. అమూల్ పాలు భారతదేశానికి తండ్రి. అటువంటి చర్య తీసుకున్నందుకు అమూల్ మిల్క్‌కి
హృదయపూర్వక ధన్యవాదాలు "అని సందేశం యొక్క అనువాదం ఉంది.
*अमूल दूध के मालिक आनंद सेठ ने अपने फैक्ट्री से 1 लाख 38 हजार मुस्लिम लोगो को निकाला, कहा देश मे थूक वाला जिहाद देख कर हम लोगो को गंदा दूध, दही, धी नहीं पिला खिला सकते, क्युकी अमूल दूध पिता है इंडिया*
— Surender Singh Rana (@Surende05060255) July 5, 2021
🙏👆🏿🙏
*अमूल दूध को दिल से आभार ऐसा कदम उठाने के लिए*
ఈ పోస్టులు ఫేస్ బుక్, ట్విట్టర్ లో పలువురు పోస్టు చేశారు.
Archived links:
https://web.archive.org/web/20210716060804/https://www.facebook.com/photo?fbid=571584940883524
https://web.archive.org/save/https://twitter.com/Vijay_vkjain/status/1411302392944078848
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
అమూల్ తన సోషల్ మీడియా ఖాతాలలో లేదా వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ సీఈఓ ఆనంద్ సేథ్ అని వైరల్ పోస్టులో ఉంది. అయితే ఇది నిజం కాదు.
అమూల్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ చైర్మన్ షమల్‌భాయ్ బి పటేల్, వైస్ చైర్మన్ వలంజీభాయ్ ఆర్ హుంబల్. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎస్ సోధి.
డాక్టర్ రూపీందర్ సింగ్ సోధి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, లిమిటెడ్, (అమూల్) మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. డాక్టర్ సోధి రెండు దశాబ్దాలకు పైగా అమూల్ యొక్క మార్కెటింగ్ మరియు అమ్మకాల కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆయన మార్కెటింగ్ అత్యంత వినూత్నమైన మరియు విస్తృతంగా ప్రశంసలు పొందింది. పాలను 'ప్రపంచంలోని అసలుసిసలైన ఎనర్జీ డ్రింక్ గా ప్రోత్సహించడం', 'ఈట్ మిల్క్' ప్రచారం భారత్ లో హైలైట్ గా నిలిచింది. ప్రతి భోజనంలో పాల ఉత్పత్తులు, అముల్ దూధ్ పీతా హై ఇండియా వంటివి అమూల్ కు పెద్ద ఫాలోయింగ్ తీసుకుని వచ్చింది.
https://www.nfn.org.in/dr-rs-sodhi
అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ఈ కథనాలను ఖండించారు. గత రెండేళ్లలో కంపెనీ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని, అమూల్‌కు 1.38 లక్షల మంది ఉద్యోగులు లేరని కూడా సోధి తెలిపారు. అమూల్ ఫ్యాక్టరీలలో 16,000 నుండి 17,000 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ఉద్యోగులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎవరైనా తొలగించినప్పటికీ, అతని మతం ఎప్పటికీ ఆధారం కాదని తేల్చి చెప్పారు.
సోధి మాట్లాడుతూ అమూల్ ఒక సహకార సమాజం(కో ఆపరేటివ్ సొసైటీ) అని.. దీనికి యజమాని లేడు. దీని యజమానులు కంపెనీకి పాలు సరఫరా చేసే రైతులు. ఈ రైతులు వివిధ మతాలు మరియు వర్గాలకు చెందినవారని చెప్పుకొచ్చారు.
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ గుజరాత్ యొక్క డెయిరీ కోఆపరేటివ్స్ యొక్క అత్యున్నత సంస్థ. దీనిని 'అమూల్' అని పిలుస్తారు. అముల్ బ్రాండ్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదు, ఉద్యమం కూడా. ఇది ఒక విధంగా రైతుల ఆర్థిక స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ సంస్థకు యజమాని లేరు.
http://www.amul.com/m/organisation
అమూల్ మిల్క్ సంస్థ ఓనర్ 1.38 లక్షల ముస్లిం ఉద్యోగులను విధుల నుండి తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.