పదో తరగతి విద్యార్థి పరీక్ష పేపర్ లో 'భీమ్లా నాయక్' సినిమా కథను రాశాడనే వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనికి సున్నా మార్కులు వచ్చాయని చెబుతూ ఉన్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనంగా పేర్కొంటూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను 6 జూన్ 2022న విడుదల చేసింది. 67.26% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇది వివాదానికి దారి తీసింది.
షేర్ చేయబడుతున్న స్క్రీన్‌షాట్ 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే' ప్రోగ్రామ్‌లోనిదని మేము కనుగొన్నాము. ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రతివారం ప్రసారం అవుతుంది. ఇది చివరిగా 4 జూన్ 2022న ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల కావడానికి ముందు ప్రసారం చేయబడింది.
స్క్రీన్‌షాట్‌లో కొన్ని వ్యాకరణ దోషాలు, పదాలలో తప్పులు కూడా మేము గమనించాము. సినిమా పేరు కూడా తప్పుగా వ్రాయబడింది. ఒక వార్తా సంస్థ ఇలాంటి తప్పులు చేయడం అసాధారణం.
దీన్ని బట్టి ఆ పోస్టును డిజిటల్‌గా మార్చినట్లు స్పష్టమవుతోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చే టెక్స్ట్ స్టైల్, షేర్ చేస్తున్న పోస్ట్‌కు పొంతన లేకుండా ఉంది.
మేము సంఘటన గురించి వార్తా నివేదికల కోసం కూడా వెతికాము.. కానీ అలాంటిది ఏదీ కనుగొనబడలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు.