దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ, సోనియా గాంధీతో పాటు యువ రాహుల్ గాంధీ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని బురఖా, హిజాబ్ ధరించి ఉందని చెబుతూ ఫోటోను షేర్ చేస్తున్నారు.
ఇందిరాగాంధీని ‘ఇందిరాఖాన్’ అని, రాహుల్ గాంధీని ‘రాహుల్ ఖాన్’ అని పిలుస్తూ పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు ఫొటోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.
ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా, మేము ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ సంస్కరణను కనుగొన్నాము. ఒరిజినల్ ఫోటో ఇందిరా గాంధీ చీర మీద జాకెట్‌తో తలపై చీర పల్లుతో ఉన్నట్లు చూపిస్తుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ మాతృ సంస్థ అయిన BCCL (బెన్నెట్, కోల్‌మన్ మరియు కంపెనీ లిమిటెడ్)లో ఫోటో క్రెడిట్ చేశారు.
దీనిని ఒక సూచనగా తీసుకొని, మేము టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్కైవ్‌లో ఫోటో కోసం వెతికాము. అదే ఒరిజినల్ వెర్షన్‌ను కనుగొన్నాము, “ప్రధాని ఇందిరా గాంధీ తన మనవడు రాహుల్‌తో పాటు, అతని తల్లి సోనియా ఉన్నారు మే 09, 1971న న్యూ ఢిల్లీలో తీసిన ఫోటో అని తెలిపారు.
కత్తిరించబడని ఒరిజినల్, కత్తిరించిన వెర్షన్ మధ్య పోలిక చూడొచ్చు.
ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బుర్ఖా, హిజాబ్‌లో ఉన్నట్లు వస్తున్న వాదన తప్పు అని మేము నిర్ధారించాము.