నిజమెంత: సచిన్ పైలట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమించబోతున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారా..?
Congress president did not announce Sachin Pilot will replace Ashok Gehlot as Rajasthan CM.అశోక్ గెహ్లాట్ స్థానంలో సచిన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2022 8:48 AM GMTఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను షేర్ చేస్తూ, "ఖర్గే సిమ్లాలో పెద్ద ప్రకటన చేసాడు, సచిన్ పైలట్ కొత్త ముఖ్యమంత్రి అవుతారని.. తిరుగుబాటు చేస్తే అశోక్ గెహ్లాట్ ను శిక్షిస్తామని అన్నారు" అని చెప్పుకొచ్చారు. ("Kharge made a big announcement in Shimla, Sachin Pilot will be the new Chief Minster, and Ashok Gehlot will be punished for his rebellion.") అంటూ పోస్టుల్లో పెట్టారు.
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరో ఫేస్‌బుక్ వినియోగదారు కూడా అదే క్లెయిమ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. (పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం.. మొత్తం వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలను విన్నది. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని కనుగొన్నాము. మేము పలు వార్తా నివేదికల కోసం కూడా వెతికాము.. కానీ సచిన్ పైలట్ గురించి మల్లికార్జున ఖర్గే చేసిన ఎటువంటి ప్రకటన కనుగొనబడలేదు.
మేము కాంగ్రెస్ పార్టీ అధికారిక YouTube ఛానెల్‌లో కీవర్డ్ శోధనను నిర్వహించాము. నవంబర్ 9న ఛానెల్ ప్రచురించిన అదే వీడియోను కనుగొన్నాము. నవంబర్ 12న జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖర్గే బహిరంగ సభలో మాట్లాడారు.
వీడియోలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఖర్గే విమర్శనాత్మకంగా మాట్లాడినట్లు మేము కనుగొన్నాము. నిరుద్యోగం, అగ్నివీర్ పథకం తదితర సమస్యలపై ఆయన వాయిస్ ను వినిపించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీలను నెరవేరుస్తుందని ఖర్గే ప్రసంగంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుందని, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 680 కోట్ల స్టార్టప్ ఫండ్ వంటి విషయాలపై చర్చించారు. కానీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లేదా రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకుని రాలేదు.
నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే ప్రసంగించిన వార్తా కథనాలను మేము కనుగొన్నాము. కానీ అశోక్ గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమించడం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. (రిపోర్టులను చదవడానికి ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేయండి.)
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించలేదు.
కాబట్టి.. వైరల్ అవుతున్న దావా తప్పు.