ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే..! ఈ గాయం కొందరి దాడి వలన జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. అధికారులేమో ప్రమాదం కారణంగానే ఆమెకు ఈ గాయమైందని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ తనకు గాయమైనప్పటికీ వీల్ చైర్ లోనే ప్రచారం చేస్తానని అన్నారు.. చెప్పినట్లుగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రజలు పడుతున్న బాధల ముందు తన బాధ చాలా చిన్నదంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎంత బాధనైనా భరించి బీజేపీని ఎండగడుతానని.. పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీని లేకుండా చేస్తానని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.


తాజాగా మమతా బెనర్జీ లేచి నడుస్తున్నారంటూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. బెంగాల్ లో అద్భుతం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మమతా బెనర్జీ వీల్ చైర్ లో నుండి లేచి నడుస్తూ వెళ్తున్నారంటూ ఫోటోను పోస్టు చేస్తూ ఉన్నారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ గాయపడ్డాక నడిచినట్లు ఎటువంటి మీడియా కథనాలు కూడా రాలేదు.

ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఒరిజినల్ ఫోటో జూన్, 2012 సంవత్సరం నాటిదని తేలింది.

Reuters కూడా ఈ ఫోటోను బి. మాథుర్ తీశారని క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నాక బయటకు వస్తున్న మమతా బెనర్జీ అంటూ ఫోటో గురించి వివరించారు.అప్పటి ఒరిజినల్ ఫోటోకు.. ఇప్పుడు వైరల్ చేస్తున్న ఫోటో రెండూ ఒకేలా ఉన్నాయి. అందులో ఆమె హావభావాలు, నడుస్తున్న స్టైల్, చేతులు ఉంచిన తీరు మొత్తం గమనిస్తే వైరల్ అవుతున్న ఫోటోను ఎడిట్ చేసినట్లుగా తెలుస్తుంది.

https://www.business-standard.com/article/elections/ec-concludes-injuries-sustained-by-mamata-not-result-of-attack-report-121031400391_1.htmlమమతా బెనర్జీ వీల్ చైర్ లో కూర్చున్న ఫోటోలకు సంబంధించిన బాగ్రౌండ్ ను కూడా గమనించవచ్చు. అధికారిక మీడియా ఇటీవల విడుదల చేసిన ఫోటోను చూడొచ్చు. మమతాబెనర్జీ 2012లో కట్టుకున్న చీరను ఎడిట్ చేయడాన్ని కూడా కింద ఉన్న ఫోటోలలో గమనించవచ్చు.


మమతా బెనర్జీ వీల్ చైర్ లో నుండి నడుస్తూ వెళ్ళింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


సామ్రాట్

Next Story