ఓ బ్లాక్ అండ్ వైట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ యోగాసనాలు చేస్తోంది భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
'భారత ప్రధాని నరేంద్ర మోదీని మీరు ఇలా చూసి ఉండరు' అంటూ పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. యోగిగా మారి నరేంద్ర మోదీ చేసిన ఆసనాలు అంటూ ట్విట్టర్ లో ఈ పోస్టును పెట్టారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కీ ఫ్రేమ్స్ ఆధారంగా వీడియోను మే 31, 2009 న యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్ ప్రకారం ఆ వీడియోలో ఉన్న వ్యక్తి బేలూర్ కృష్ణమాచార్ సుందరరాజ ఐయ్యంగార్ మరియు తిరుమాలై కృష్ణమాచార్య (Bellur Krishnamachar Sundararaja Iyengar and Tirumalai Krishnamacharya). ఈ వీడియో 1938వ సంవత్సరంలో తీసినది.
వైరల్ క్లిప్ కు సంబంధించిన మరో వీడియో కూడా లభించింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి బికెఎస్ అయ్యంగార్.. ఆయన అయ్యంగార్ యోగాను స్థాపించారు. ప్రపంచంలోనే గొప్ప యోగా గురువుల్లో బికెఎస్ అయ్యంగార్ కూడా ఒకరు.
వైరల్ అవుతున్న వీడియోలకు, యూట్యూబ్ క్లిప్స్ ను పోల్చి చూడగా.. రెండు ఒకటే అని ధృవీకరించబడింది. బికెఎస్ అయ్యంగార్ అధికారిక వెబ్సైట్ లో కూడా ఈ వీడియోల్లో ఉన్నది ఆయనే అని తెలిపారు. వెబ్సైట్ లో ఉన్న ఫోటోను కూడా పోల్చి చూడడం జరిగింది.
నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17, 1950న జన్మించగా.. ఈ వీడియోను 1938 లో తీశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది నరేంద్ర మోదీ అంటూ ప్రచారం అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.