కర్ణాటక మెడికల్ కాలేజీకి చెందిన 17 మంది మహిళా డాక్టర్లు ఓ ప్రమాదంలో చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. బెంగళూరు-పూణే హైవే మీద ఈ ఘోర యాక్సిడెంట్ జరిగిందని.. ఈ ప్రమాదంలో 17 మంది మహిళా డాక్టర్లు చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒకే ప్రమాదంలో 17 మంది మహిళా డాక్టర్లు చనిపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
"RIP. 17 lady doctors all #gynaecologist professors of JJMM College Davengere, Karnataka going from Davengere to Goa on picnic trip died on spot on Bengaluru Pune highway when their minibus crashed with a sand laden tipper at DHARWAD at 7.30am on Friday." అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు. కర్ణాటక లోని
దావణగేరేలో ఉన్న జెజెఎంఎం కాలేజీకి చెందిన 17 మంది లేడీ డాక్టర్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని.. దావణగేరే నుండి గోవాకు పిక్నిక్ కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. మినీ బస్ ను ఓ ఇసుక లారీ గుద్దిందని.. ధార్వాడ్ లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఈ పోస్టులు తప్పుద్రోవ పట్టించేది.. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు.
ఈ ఘటనకు సంబంధించిన ఎన్నో న్యూస్ రిపోర్టులను పరిశీలించగా ఈ ఘటన హుబ్బళి-ధార్వాడ్ బైపాస్ రోడ్ లో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలో చోటు చేసుకుంది.
Outlook, India Today మీడియా కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో చనిపోయిన వారు 1989 బ్యాచ్ సెయింట్ పాల్ స్కూల్, దావణగేరేకు చెందిన వారు. సంవత్సరం అల్యూమినీ ట్రిప్ గా గోవాకు వెళ్లాలని అనుకున్నారు. జనవరి 15న వారు వెళుతున్న మినీ బస్ ఇసుక లారీని ఢీకొట్టింది.
ధార్వాడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పి.కృష్ణ కాంత్ మాట్లాడుతూ ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించారు. అందులో 9 మంది మహిళలు ఉన్నారు. చనిపోయిన వారంతా డాక్టర్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చనిపోయిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే డాక్టర్ అని ఆయన వివరణ ఇచ్చారు.
17 మంది మహిళా డాక్టర్లు చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ వార్త తప్పుద్రోవ పట్టించేదే.