"వరంగల్ వేయి స్థంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు. ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చకొడుతున్న క్రైస్తవులు. చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ" అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
స్తంభాలు ఉన్న చోట కొంతమంది వ్యక్తులు ప్రార్థనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నట్లు వీడియోలో ఉందని పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు పేర్కొన్నారు.
ఈ వీడియో వేయి స్తంభాల గుడిలో ఉన్నట్లు సమాచారం అందుతుందని, అయితే అది మరేదైనా దేవాలయం నుంచి కావొచ్చని పేర్కొంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
ఆ వైరల్ పోస్టు వెయ్యి స్తంభాల గుడిది కాదని, ఆ దావా తప్పు అని NewsMeter ధృవీకరించింది.
ఎం.నాగేశ్వరరావు ట్వీట్‌కు తెలంగాణ పోలీసుల నుండి రిప్లై వచ్చింది. ఆ వీడియో వేయి స్తంభాల గుడిలోనిది కాదని, దానిని ఫార్వార్డ్ చేసే ముందు ప్రామాణికతను ధృవీకరించమని కోరింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ దీనిపై స్పందించారు. అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ సంఘటన వరంగల్ కోటలో జరిగినట్లు పేర్కొంది. మత సామరస్యానికి విఘాతం కలిగించిన నిందితులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. వైరల్ పోస్టులు చేస్తున్న వారిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
తెలంగాణ పోలీస్ చీఫ్ కూడా ఈ ఘటన వేయి స్తంభాల గుడిలో జరగలేదని ట్విటర్ ద్వారా ధృవీకరించారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు తెలంగాణ కట్టుబడి ఉందని, వీడియోలు వ్యాప్తి చేసే వారిని పోలీసు విభాగం ఖచ్చితంగా శిక్షిస్తుందని హెచ్చరించారు.
వరంగల్ లోని వేయి స్తంభాల గుడిలో క్రైస్తవ మత ప్రార్థనలు జరగలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
- Credits : Md Mahfooz Alam