ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ నేతలకు పూలమాల వేసి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో సీఎం తమ పార్టీ నేతలకు బంగారు గొలుసులతో స్వాగతం పలికారని ప్రచారం జరుగుతోంది.
పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా ఇదే విషయాన్ని షేర్ చేశారు.
ఫేస్ బుక్ లో కూడా ఇదే వాదనతో షేర్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
గడ్డితో, ఖిర్సాలీ అనే చెట్టు భాగాలతో చేసిన దండలతో భూపేష్ బఘేల్ అతిథులను స్వాగతిస్తున్నట్లు వీడియోలో ఉందని న్యూస్ మీటర్ ధృవీకరించింది.
ఈ దండ గురించి భూపేష్ బఘేల్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ‘బైగా’ కమ్యూనిటీకి చెందిన ఇత్వారీ రామ్ మచియా అనే వ్యక్తి ఆ దండ తయారీ గురించి చెప్పుకొచ్చారు. “బిరాన్” అనే దండ గురించి మాట్లాడుతున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. గడ్డి, "ఖిర్సాలీ" అని పిలువబడే చెట్టు భాగాలను ఉపయోగించి దండను తయారు చేసినట్లు ఇత్వారీ రామ్ మచియా వివరించారు. ప్లీనరీ సందర్భంగా అటువంటి దండను ఉపయోగించినందుకు భూపేష్ బఘేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
వైరల్ క్లిప్‌లో కనిపించిన అదే దండను ఒక మహిళ తయారు చేస్తున్నట్లు వీడియోలో ఉంది.
కాంగ్రెస్ నాయకుడు, ఆల్-ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కోశాధికారి పవన్ కుమార్ బన్సాల్ దండకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. దండపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లోని పేద గిరిజన మహిళలు ఈ దండను తయారు చేశారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ నేతలకు వెదురు చెట్లతో చేసిన దండలతో స్వాగతం పలికారని ఎన్‌బిటి కథనం నివేదించింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంతంలో స్థానికంగా హారాన్ని తయారు చేసినట్లు అతిథులకు స్వాగతం పలికిన సందర్భంగా సీఎం తెలియజేసినట్లు కూడా అందులో పేర్కొంది.
రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం బంగారు గొలుసులతో నాయకులను స్వాగతించలేదని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credit : Md Mahfooz Alam