భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాక్సిన్ ను 12 సంవత్సరాల పైబడిన వారికి ఇవ్వొచ్చు అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
"Great News: Bharat Biotech (Made in India) Covaxin Approved for Children Above 12 years." అంటూ పలువురు పోస్టులను పెట్టడం గమనించవచ్చు.
ఎంతో గొప్ప విషయం.. భారత్ బయో టెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ ను 12 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఇవ్వొచ్చు.. అంటూ అందులో చెప్పుకొచ్చారు.
నిజనిర్ధారణ:
12 సంవత్సరాలు పైబడిన వారికి కూడా కోవ్యాక్సిన్ ను ఇవ్వొచ్చు అని ప్రభుత్వం ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా కూడా ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి భారతదేశంలో 18 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకే కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిపింది. 12 సంవత్సరాల పైబడిన వారి కోసం భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాక్సిన్ కు ఇంకా అప్రూవల్ లభించలేదు.
మే 1 నుండి 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని యూనియన్ హెల్త్ మినిస్టర్ చెప్పారు. దేశంలో 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుండి కూడా 12 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ప్రకటన రాలేదు.
https://www.mohfw.gov.in/covid_vaccination/vaccination/faqs.html
2-18 సంవత్సరాల మధ్య ఉన్న వారిపై వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ కు అనుమతులు ఇచ్చింది. 525 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగానికి భారత్ బయోటెక్ సిద్ధమైంది. ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగపూర్ లలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
https://www.hindustantimes.com/india-news/dcgi-approves-phase-2-3-clinical-trial-of-covaxin-on-218yearolds-101620882472678.html
https://timesofindia.indiatimes.com/india/dgci-gives-nod-for-covaxin-phase-ii/iii-trials-on-2-18-year-olds/articleshow/82600969.cms
https://indianexpress.com/article/explained/bharat-biotechs-covaxin-phase-2-3-trials-on-children-explained-7313437/
ఇప్పటి వరకూ అయితే భారత్ లో కోవ్యాక్సిన్ ను 12 సంవత్సరాల పైబడిన వారికి ఇస్తున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాక్సిన్ ను 12 సంవత్సరాల పైబడిన వారికి ఇవ్వొచ్చు అంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో నిజం లేదు.