FactCheck : మాగంటి గోపీ నాథ్ కోపంతో ఊగిపోతున్న వీడియో ఈ ఎన్నికల సమయంలోనిది కాదు

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ ఓట్ల కోసం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2023 4:00 PM GMT
FactCheck : మాగంటి గోపీ నాథ్ కోపంతో ఊగిపోతున్న వీడియో ఈ ఎన్నికల సమయంలోనిది కాదు

హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ ఓట్ల కోసం ఇంటింటికీ తిరుగుతుండగా ఓ మహిళతో వాగ్వాదం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా ఓటర్లలో BRS మీద వ్యతిరేకత ఉందని.. ఇదే సాక్ష్యం అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఈ వీడియోను షేర్ చేసి.. “జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజా సమస్యలను విస్మరించినందుకు ధైర్యవంతురాలైన మహిళ ప్రశ్నించింది. తెలంగాణలో మహిళా సాధికారత కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని మద్దతుదారులు ఆమెను బెదిరించే ప్రయత్నాలు చేసినప్పటికీ, మహిళ ప్రతిఘటించిందని.. ఇది రాష్ట్రంలో జరగబోయే గణనీయమైన మార్పుకు నిదర్శనం.” అంటూ ట్వీట్ చేశారు.

మరో ప్రీమియమ్ X హ్యాండిల్ లో కూడా వీడియోను షేర్ చేశారు. “మహిళా ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నిస్తున్నారు, అతను సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. BRS పార్టీ కార్యకర్తలు మహిళా ఓటర్లతో బిగ్గరగా వాదిస్తూ, మాకు మీ అవసరం లేదు అని చెప్పారు. #TelanganaElections2023.” అంటూ ట్వీట్ కూడా చేశారు.

నిజ నిర్ధారణ :

2018లో రాష్ట్ర ఎన్నికల కోసం గోపీనాథ్ చేసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో అని న్యూస్‌మీటర్ కనుగొంది.

ఆ వీడియోలో గోపీనాథ్ వేసుకున్న గులాబీ కండువాపై ‘TRS’ అని రాసి ఉండడం గమనించాము. ఆ వీడియో పాతదై ఉండొచ్చని మేము భావించాం.

డిసెంబర్ 5, 2022న, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చడానికి భారత ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు, పార్టీ అధిష్టానం జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఈ క్యూ ఆధారంగా మేము కీవర్డ్ సెర్చ్‌ని రన్ చేసాము. YouTubeలో అదే వీడియోని వెరిఫై చేసిన యూట్యూబ్ ఛానెల్, డైలీ కల్చర్, నవంబర్ 10, 2018న అప్లోడ్ చేసింది. ‘జూబ్లీ హిల్స్ లేడీ మాగంటి గోపీనాథ్‌కి షాక్ ఇచ్చింది,’ అనే టైటిల్‌ తో వీడియోను అప్లోడ్ చేశారు.


మరో యూట్యూబ్ ఛానెల్, రాజ్ న్యూస్ తెలుగు అఫీషియల్, నవంబర్ 10, 2018న, ‘ఎన్నికల ప్రచారంలో మహిళలను అవమానించిన జూబ్లీహిల్స్ TRS మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్’ అనే టైటిల్‌తో అదే విజువల్స్‌ను చూపిస్తూ వీడియో నివేదికను ప్రచురించింది.


మరో వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్ వార్త వాణి కూడా నవంబర్ 10, 2018న ‘ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపీనాథ్‌ను అవమానించిన మహిళలు.’ అనే వీడియోను ప్రచురించింది.


కాబట్టి, ఈ వీడియో 2018 నాటిదని.. 2023 ఎన్నికల కోసం గోపీనాథ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో జరగలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.

Credits : Md Mahfooz Alam

Claim Review:మాగంటి గోపీ నాథ్ కోపంతో ఊగిపోతున్న వీడియో ఈ ఎన్నికల సమయంలోనిది కాదు
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story