Fact Check : మనిషి ముఖం పోలిన షార్క్ జాలర్లకు చిక్కిందా..?
baby shark was born with 'human face' in Indonesia. ఓ వింత ఆకారంతో పుట్టిన జీవికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో
By Medi Samrat Published on 1 March 2021 6:50 AM GMTఇండోనేషియాలోని జాలర్లకు ఈ చేప చిక్కిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను, ఫోటోలను పోస్టు చేస్తూ ఉన్నారు.
baby Shark with a human face 🧐🧐 pic.twitter.com/BU0ByVFUtM
— Mukesh Kumar (@MukeshK91122248) February 25, 2021
A Baby Shark With A 'Human Face' watch amazing video https://t.co/6T6T4PLJKB via @YouTube #shark,#humanface,#indonesia,#fisherman,#AbdullahNuren,#amazingnews,#aaknews, pic.twitter.com/aCkxgx6M0E
— Mahrani (@Mahrani90809546) February 25, 2021
Archive links: https://web.archive.org/save/https://twitter.com/MukeshK91122248/status/1364778355778752514
https://web.archive.org/save/https://www.youtube.com/watch?v=vqzjUGzQufw&feature=youtu.be
నిజ నిర్ధారణ:
మనిషి ముఖం పోలిన షార్క్ ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'నిజమే'.
రిపోర్టుల ఆధారంగా మనిషి ముఖం పోలిన షార్క్ ను ఇండోనేషియాలో కనుగొన్నారు. అబ్దుల్లా నూరెన్ అనే జాలరి ఈ చిన్న షార్క్ ను పట్టుకున్నాడు. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్ లోని రోటే ఎందావో ప్రాంతంలో ఈ చెప్పాను పట్టుకున్నాడు.
మొదట ఆ జాలరి ఒక పెద్ద షార్క్ ను తన వలలో పట్టుకున్నాడు. ఆ తల్లి షార్క్ పొట్టను చీల్చగా మూడు పిల్లలు దాని కడుపులో ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం ఇలా మనిషి ముఖం పోలినట్లుగా ఉంది. రెండు పెద్ద కళ్ళతో కనిపించి.. చూడగానే మనిషి ముఖంలా అనిపించింది. మిగిలిన రెండు చేపలు తల్లి లాగే కనిపించినా ఈ చేప మాత్రం కాస్త అరుదుగా కనిపించినట్లు తెలిపారు.
ఇండోనేషియా న్యూస్ వెబ్ సైట్స్ కథనం ప్రకారం ఆ చేప చనిపోయిందని తెలిపారు. కొందరు ఈ వింత చేపను కొనుక్కోడానికి ముందుకు వచ్చినప్పటికీ నూరెన్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయం బయటకు పొక్కగానో అతడి ఇల్లు జనాలతో కిక్కిరిసిపోయింది. ఎంతో మంది వచ్చి ఫోటోలు, వీడియోలను తీసుకుని వెళ్లిపోయారట.
మనిషి ముఖం తో షార్క్ జన్మించిందంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజమే..!