FactCheck : నుపుర్ శర్మను ప్రశంసిస్తూ అమిత్ షా లెటర్ రాశారా..?

Amit Shahs letter Praising Nupur Sharma is Fake. సస్పెండ్ చేయబడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నుపుర్ శర్మ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2022 3:30 PM GMT
FactCheck : నుపుర్ శర్మను ప్రశంసిస్తూ అమిత్ షా లెటర్ రాశారా..?

సస్పెండ్ చేయబడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదానికి దారి తీసింది. ఓ టీవీ డిబేట్‌లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో ముహమ్మద్‌ ప్రవక్త పై నుపుర్ శర్మ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్‌ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి వివరణ, క్షమాపణలు కోరాయి. నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పారు నుపుర్ శర్మ.


నుపుర్ శర్మను ప్రశంసిస్తూ, ఆమెను ఐకాన్‌గా పేర్కొంటూ హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శర్మకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని లేఖలో అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. Z కేటగిరీ అనేది భారతదేశంలో మూడవ-అత్యున్నత స్థాయి భద్రత. ఇది పోలీసు లేదా ITBP (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) లేదా CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) సిబ్బంది, ఒక ఎస్కార్ట్ కారు ద్వారా భద్రతా రక్షణను కల్పిస్తారు.

నిజ నిర్ధారణ :

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖకు సంబంధించిన వార్తను న్యూస్‌మీటర్ కనుగొనలేదు. ఇలాంటి లేఖపై ఏ మీడియా కూడా కథనం ప్రసారం చేయలేదు. ఒకవేళ నిజంగానే, అమిత్ నూపుర్ శర్మను RSS భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఒక ఐకాన్ అని ప్రశంసించినా, Z కేటగిరీ భద్రతను అభ్యర్థించినట్లయితే అది విశ్వసనీయ మీడియా సంస్థలచే నివేదించబడి ఉండేది. అయితే ఈ లేఖ నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది. లేఖలో ఎన్నో వ్యాకరణ లోపాలు ఉన్నాయి, అధికారిక లెటర్ లో ఇలాంటివి జరగడం చాలా అరుదు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని విజయవంతంగా నిర్వహించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారని పేర్కొంటూ గత ఏడాది ఇదే విధమైన నకిలీ లేఖ వైరల్ అయింది. నిశితంగా పరిశీలించిన తర్వాత, రెండు లేఖల్లోనూ 'HMP నెం - 28647021' అనే సంఖ్యా గుర్తు ఉన్నట్లు గుర్తించబడింది. దీంతో పాత ఫేక్ లెటర్ ను ఎడిట్ చేసి మరో లేఖగా షేర్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా వైరల్ లేఖను నకిలీ అని పేర్కొంది. అలాంటి లేఖ ఏదీ హోంమంత్రి జారీ చేయలేదని పేర్కొంది.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
























Claim Review:నుపుర్ శర్మను ప్రశంసిస్తూ అమిత్ షా లెటర్ రాశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story