నిజమెంత: ఇజ్రాయెల్ ఆర్మీ కుక్క పాలస్తీనా మహిళపై దాడి చేస్తున్న ఫోటో నిజమైనది కాదు

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2024 7:15 AM IST
fact chek, ai photo, israeli army dog, attack, palestinian woman,

నిజమెంత: ఇజ్రాయెల్ ఆర్మీ కుక్క పాలస్తీనా మహిళపై దాడి చేస్తున్న ఫోటో నిజమైనది కాదు 

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఓ వృద్ధురాలి మీద ఓ కుక్క దాడి చేస్తున్నట్లుగా అనిపించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పాలస్తీనా మహిళపై కుక్క దాడి చేస్తోందని.. దీన్ని ఇజ్రాయెల్ సైన్యం ట్రెయిన్ చేసిందంటూ ఈ ఫొటోను పలువురు షేర్ చేస్తున్నారు.

ఇది సినిమాల్లోని సన్నివేశం కాదు అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. “Not a scene from a movie.” అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ సంఘటన నిజంగా చోటు చేసుకున్నది కాదు.. ఈ చిత్రం AI ద్వారా రూపొందించారు.

ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఫోటో యొక్క కోణం, కుక్క రూపం చూశాక ఫోటో AI ద్వారా రూపొందించి ఉండవచ్చని అర్థం అవుతోంది. ఈ చిత్రం తదుపరి తనిఖీలలో దాని మూలాన్ని సూచించే వాటర్‌మార్క్ - IN.VISUALART అని ఉందని గుర్తించాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లు 'Ps+ Ai' సంకేతం సూచిస్తుంది.

దీనికి సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఆరు రోజుల క్రితం నాటి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ మాకు కనిపించింది. ఇక్కడ అదే ఫోటోను “అల్-జజీరా వృద్ధ పాలస్తీనా మహిళపై కుక్క దాడి చేస్తున్న ఫుటేజీ లభించింది. మారణహోమం ఆపండి- గాజా-రహిత పాలస్తీనాను రక్షించండి." అనే వాదనతో పోస్టు చేశారు. “Al-Jazeera obtained leaked footage from a camera mounted by occupation soldiers on a police dog showing the dog attacking an elderly Palestinian woman in her home during an operation the occupation army was about to carry out in Jebalia camp weeks ago. Stop genocide - Ceasefire now- Save Gaza- free Palestine.” అంటూ క్యాప్షన్ ఉంచారు.

సంబంధిత కీలక పదాలను ఉపయోగించి తదుపరి పరిశోధన చేయగా YouTubeలో అల్ జజీరా ఇంగ్లీష్ ప్రచురించి వీడియోను కనుగొన్నాం. ‘Israeli military dog attacks elderly Palestinian woman | #AJshorts,’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. అందులో అసలైన ఘటనకు సంబంధించిన విజువల్స్ ను మనం గమనించవచ్చు.

కుక్క ఓ మహిళపై దాడి చేసిన విజువల్స్ తో పాటూ.. ఆమెతో ఇంటర్వ్యూను కూడా ప్రచురించారు. జబాలియాలో ఆర్మీ ఆపరేషన్‌ సమయంలో పాలస్తీనా మహిళను ఇజ్రాయెల్ మిలిటరీ కుక్క దాడి చేసిన వీడియో " అనే శీర్షికతో అదే ఛానెల్‌లో మరో వీడియోను కూడా మనం గమనించవచ్చు. అందులో ఆ మహిళ దాడి జరిగిన ఘటన గురించి వివరించారు.

ఇతర మీడియా అవుట్ లెట్లు కూడా ఈ ఘటనకు సంబంధించి పలు నివేదికలను ప్రచురించాయి. పాలస్తీనా క్రానికల్‌తో సహా వివిధ వార్తా సంస్థలు ఈ సంఘటనను నివేదించాయి. “‘Israelis Set a Dog on Me’ – Video Shows Army Unleashing Dog on Elderly Palestinian Woman.” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ సంఘటన జరిగినట్లు మీడియా సంస్థలు చెబుతున్నా.. వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించారు.

Claim Review:నిజమెంత: ఇజ్రాయెల్ ఆర్మీ కుక్క పాలస్తీనా మహిళపై దాడి చేస్తున్న ఫోటో నిజమైనది కాదు
Claimed By:X, Facebook And Threads
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story