FactCheck : లాలా అమర్ నాథ్ బయోపిక్ లో ఆమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ ఇదేనా?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ డిఫెన్స్ యూనిఫాంలో కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2023 4:20 PM GMT
FactCheck : లాలా అమర్ నాథ్ బయోపిక్ లో ఆమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ ఇదేనా?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ డిఫెన్స్ యూనిఫాంలో కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రికెటర్ లాలా అమర్‌నాథ్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ఇది అంటూ సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

ఒక X (గతంలో ట్విట్టర్) యూజర్ “అమీర్ ఖాన్ నెక్స్ట్ మూవీ.... రాజ్‌కుమార్ హిరానీతో లాలా అమర్‌నాథ్ బయోపిక్” అనే క్యాప్షన్‌తో ఫోటోను షేర్ చేశారు.


“Aamir Khan Next Movie .... Biopic on Lala Amarnath With Rajkumar Hirani.” అంటూ పోస్టులు పెట్టారు.

పలువురు ఫేస్ బుక్ యూజర్లు కూడా ఇదే విషయాన్ని షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

ఆ ఫోటో ఒరిజినల్ కాదని న్యూస్ మీటర్ గుర్తించింది. ఇది AI టూల్స్ ను ఉపయోగించి రూపొందించారు.

ఫోటో కింద @wild.tance అనే వాటర్‌మార్క్‌ని మేము గమనించాము. దీన్ని క్యూగా తీసుకుని, మేము ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికాము. అదే వినియోగదారు పేరుతో ఖాతాను కనుగొన్నాము. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్‌హైమర్‌లోని పాత్రలను భారతీయ నటులు చేస్తే ఎలా ఉంటుందని భావించి.. ఏఐ ద్వారా ఈ ఫోటోను సృష్టించారు. జూలై 22న పోస్ట్ చేసిన పలు ఫోటోలలో అమీర్ ఖాన్‌తో సహా భారతీయ నటుల అనేక ఫోటోలను మేము కనుగొన్నాము.

“Unfathomable Fusion: The Oppenheimer Project" అనే క్యాప్షన్ తో పలువురు భారత నటీనటులకు సంబంధించిన ఫోటోలను మేము గుర్తించాం. భారత్ కు చెందిన స్టార్ క్యాస్ట్ ఓపెన్ హైమర్ లో భాగమైతే ఎలా ఉంటుందో అని ఊహించి వీటిని క్రియేట్ చేశారు. అందులో షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ రావు.. ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు.

“These images are generated using artificial intelligence (AI) and are intended solely for entertainment purposes. There is no intention to cause harm or distress to anyone's feelings by these images. They are created with the intention of spreading joy and smiles across the world.” అంటూ వివరణ కూడా ఇచ్చారు. వీటిని ఏఐ తో రూపొందించామని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని వివరించారు.

మేము AI-డిటెక్షన్ వెబ్‌సైట్‌లలో చిత్రాన్ని తనిఖీ చేసాము. AIతో రూపొందించారని గుర్తించాము. ఈ చిత్రం 77 శాతం కృత్రిమంగా.. 23 శాతం మానవునిది అని గుర్తించింది.




అందువల్ల, వైరల్ చిత్రం AI ద్వారా రూపొందించారని మేము నిర్ధారించాము. అమీర్‌ఖాన్‌ కొత్త చిత్రంలోని లుక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.

NewsMeter ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం సృష్టికర్త (@wild.trance)ని కూడా సంప్రదించింది. మేము ఆ అకౌంట్ హోల్డర్ స్పందించిన వెంటనే ఈ ఆర్టికల్ ను అప్డేట్ చేస్తాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:లాలా అమర్ నాథ్ బయోపిక్ లో ఆమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ ఇదేనా?
Claimed By:Social Media Users
Claim Source:X, Facebook
Claim Fact Check:False
Next Story