FactCheck : 2018లో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో పెద్ద సంఖ్యలో మహిళలు TMC నాయకుడు షేక్ షాజహాన్, అతని మద్దతుదారులపై భూ ఆక్రమణలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2024 9:33 PM ISTపశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో పెద్ద సంఖ్యలో మహిళలు TMC నాయకుడు షేక్ షాజహాన్, అతని మద్దతుదారులపై భూ ఆక్రమణలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ లో వివాదాస్పదం అయింది.
ఈ నేపథ్యంలో ఓ మహిళ మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెను కిందకు నెట్టి కర్రతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సందేశ్‌ఖలీ ఘటనతో ముడిపడి ఉందని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు.
“For all the Liberals who say everything is alright in WB, there is no atrocity on women should look at this! Woman attacked on live camera !! Imagine what goes behind the scenes that isn’t recorded or reported. #WestBengal #SandeshkhaliHorror, (sic)” అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో అంతా బాగానే ఉందని చెప్పే ఉదారవాదులందరికీ.. మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. లైవ్ లో కెమెరాల ముందే మహిళపై దాడి.. రికార్డ్ చేయని లేదా నివేదించని ఘటనలు తెర వెనుక ఎన్ని జరుగుతూ ఉన్నాయో ఊహించండంటూ.. పలువురు పోస్టులు పెడుతున్నారు.
“This is “freedom of expression” in @MamataOfficial’s West Bengal. Imagine if women are hit right in front of the camera then what else happens off-camera? #SandeshkhaliHorrorStory, (sic)” అంటూ మరొకరు పోస్టు పెట్టారు. మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో 2018 నాటిదని, సందేశ్‌ఖలీ ఘటనతో తప్పుగా లింక్ చేశారని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము సెప్టెంబర్ 30, 2018న ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో కనిపించిన మహిళ నీలిమా డి సర్కార్ అని గుర్తించారు. తృణమూల్ నాయకుడు అర్షదుజ్జమాన్ సహాయకుడు కుతుబుద్దీన్ తన్నాడని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
This is the same lady Nilima De Sarkar who was "kicked" by tmc leader Arshadujjaman. Look how his accomplice Qutubuddin is thrashing her openly when she is relaying the incident to media ! @BJP4Bengal @me_locket @VijayaRahatkar @MrsGandhi pic.twitter.com/swr35EOVK9
— Keya Ghosh (@keyakahe) September 30, 2018
దీన్ని క్యూగా తీసుకొని.. మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. అక్టోబర్ 1, 2018 న ది స్టేట్స్‌మన్ మీడియా సంస్థకు సంబంధించిన ఒక నివేదికను కనుగొన్నాం. BJP మద్దతుదారురాలిని TMC నాయకులు తన్నారు.. కర్రలతో కొట్టారని తెలిపారు.
నివేదిక ప్రకారం, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల మృతికి నిరసనగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన రోజు సెప్టెంబర్ 26, 2018న ఈ సంఘటన జరిగింది. బీజేపీ మద్దతుదారు నీలిమా డి సర్కార్‌పై స్థానిక పంచాయతీ చీఫ్ అర్షదుజ్జమాన్ నేతృత్వంలోని టీఎంసీ కార్యకర్తలు మొదట దాడి చేశారని అందులో పేర్కొన్నారు. అనంతరం మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా అర్షదుజ్జమాన్ సహాయకుడు కుతుబుద్దీన్ అనే వ్యక్తి ఆమెను కింద పడేశాడు.
NDTV బంగ్లా కూడా ఈ సంఘటనను.. తృణమూల్ నాయకుడు మీడియా ముందు మహిళా బీజేపీ కార్యకర్తను కొట్టాడని నివేదించింది. బీజేపీ మహిళా కార్యకర్త సర్కార్‌పై ఒకే రోజు రెండుసార్లు దాడి జరిగింది. మొదటిసారి స్థానిక పంచాయతీ చీఫ్ అర్సదుజ్జమాన్.. రెండవ సారి తృణమూల్ నాయకుడు కుతుబుద్దీన్ ఆమెపై దాడి చేశాడు.
అందువల్ల, వైరల్ వీడియోను సందేశ్‌ఖలీ సమస్యతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam