ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్..ఆ యూజర్లకు మాత్రమే
By రాణి Published on 10 April 2020 3:42 PM GMTలాక్ డౌన్ కారణంగా అడుగు బయటికి పెట్టే ఆస్కారం లేదు. దీంతో మొత్తం ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్లోనే చుట్టేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా సోషల్ మీడియా ను బాగా వాడేస్తున్నారు. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ ఇలా ఒక్కటేంటి ఉన్న అన్ని సోషల్ యాప్ లను ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ లో స్టేటస్ లిమిట్ ను 15 సెకన్లకు తగ్గించారు. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా కొత్త ఫీచర్ ను నెటిజన్లకు పరిచయం చేసేందుకు సమాయత్తమవుతోంది. కానీ కొత్తగా తీసుకొచ్చే ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.
Also Read : ఏపీ ఎన్నికల అధికారిగా రామసుందర రెడ్డి..తక్షణమే విధుల్లోకి
అసలు విషయానికొస్తే ఫేస్ బుక్ కొత్తగా తీసుకొచ్చే ఈ ఫీచర్ పేరు క్వైట్ మోడ్. సాధారణంగా స్మార్ట్ మొబైల్స్ లో ఏరోప్లేన్ మోడ్ ఉంటుంది..ఈ క్వైట్ మోడ్ ఏంటా అనుకుంటున్నారా ? ఇది కేవలం ఫేస్ బుక్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్. మీరు టైమ్ సెట్ చేసి ఈ క్వైట్ మోడ్ ను ఆన్ చేస్తే ఆ గంట వరకూ ఫేస్ బుక్ ను చూడలేరు. అంతేకాదు..ఆ గంట సేపు ఎలాంటి ఫేస్ బుక్ నోటిఫికేషన్లు రావు. మీరు సెట్ చేసిన టైమ్ పూర్తవ్వక ముందే మీరు ఫేస్ బుక్ ఓపెన్ చేయాలనుకుంటే అలెర్ట్ కూడా వస్తుంది. ఇంకా ఎంత సమయం వరకూ వేచి ఉండాలో ఆ అలర్ట్ చెప్తుంది. ప్రస్తుతానికి ఐ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్ మే నెలాఖరు నాటికి అన్ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకొస్తుంది.
Also Read : సమంత కనిపించడం లేదు..!?